ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌పోలింగ్‌ నిర్వహణకు సహకరించిన అందరికీ కతజ్ఞతలుజిల్లా కలెక్టర్‌ ఎస్‌. షన్మోహన్‌

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌పోలింగ్‌ నిర్వహణకు సహకరించిన అందరికీ కతజ్ఞతలుజిల్లా కలెక్టర్‌ ఎస్‌. షన్మోహన్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: విజయవంతంగా పోలింగ్‌ నిర్వహణకు సహకరించిన ఎన్నికల కమీషన్‌ అబ్సర్వర్లకు, జిల్లా రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది, అన్నిశాఖల అధికారులు, జిల్లా అధికారులు, నోడల్‌ అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్‌ఓలు తహశీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడిఓలు ప్రిసైడింగ్‌ అధికారులు, ఏపీఓలు, ఓపిఓలు, పోలీస్‌ అధికారులు, కేంద్ర బలగాలు, అన్ని రకాల నిఘా స్క్వాడ్లు, సెక్టోరల్‌, రూట్‌ అధికారులు, ఎన్‌ఎస్‌ఎస్‌, మాజీ సైనికులు, ఎన్సిసి, జిల్లాస్థాయి నుంచి గ్రామ వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. షన్మోహన్‌ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహణకు సహకరించిన అన్ని వర్గాల జిల్లా ప్రజలు, ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు, రాజకీయ పార్టీలు, సంస్థలు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీల ఆధ్వర్యంలో ఈవీఏంలను ఆయా స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈసిఐ నిబంధనల మేరకు భద్రపరచే కార్యక్రమం మంగళవారం కొనసాగుతుందని పేర్కొన్నారు.

➡️