సుజాతకు డాక్టరేట్‌

గహవిజ్ఞాన శాస్త్రంలో సుజాతకు డాక్టరేట్‌

గహవిజ్ఞాన శాస్త్రంలో సుజాతకు డాక్టరేట్‌ ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని గహవిజ్ఞాన శాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థి ఎస్‌.సుజాతకు డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి మూడే దామ్లా నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వియూ మాజీ రిజిస్ట్రార్‌, గహవిజ్ఞాన శాస్త్ర ఆచార్యులు ఆర్కే అనురాధ మార్గదర్శకత్వంలో ”డిటర్మినెంట్స్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ ద బేసిక్‌ మ్యాథ్‌ కాన్సెప్ట్స్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ అచీవ్మెంట్‌ వన్‌ అండ్‌ టూ స్టాండర్డ్‌ చిల్డ్రన్‌’ అనే అంశంపై సిద్ధాంత గ్రంధాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించినట్లు వెల్లడించారు. ఇందుకుగాను సుజాతకు డాక్టరేట్‌ డిగ్రీని ప్రదానం చేసినట్లు తెలిపారు. ఎస్‌.సుజాత పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నల్‌లలో అనేక పరిశోధన పత్రాలను ప్రచురించినట్లు వివరించారు. ఎస్‌.సుజాతకు డాక్టరేట్‌ అవార్డు రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

➡️