ప్రజాశక్తి- తిరుమల : శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, నున్న సరోజినిదేవి దంపతులు బుధవారం రూ.1,01,11,111లు విరాళంగా అందించారు. చెక్కును టిటిడి చైర్మన్ బిఆర్.నాయుడు, అదనపు ఇఒ వెంకయ్య చౌదరి స్వీకరించి వారికి అభినందనలు తెలిపారు.
