పక్షవాతం లక్షణాలను వెంటనే గుర్తిస్తే…మొదటి మూడు గంటలు అమూల్యం : డాక్టర్‌ రేవంత్‌ రెడ్డి

పక్షవాతం లక్షణాలను వెంటనే గుర్తిస్తే...మొదటి మూడు గంటలు అమూల్యం : డాక్టర్‌ రేవంత్‌ రెడ్డి

పక్షవాతం లక్షణాలను వెంటనే గుర్తిస్తే…మొదటి మూడు గంటలు అమూల్యం : డాక్టర్‌ రేవంత్‌ రెడ్డి ప్రజాశక్తి – తిరుపతి సిటిపక్షవాతం ఒక అత్యవసర స్థితి అని, పక్షవాతం వచ్చిన రోగి మూడు గంటలలో న్యూరాలజిస్టును సంప్రదిస్తే పక్షవాతాన్ని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మెదడు వెన్నుపూస, నరాల వైద్య నిపుణులు డాక్టర్‌ ఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. స్థానిక రెడ్డి అండ్‌ రెడ్డి కాలనీ లో గల రేవంత్‌ న్యూరో కేర్‌ హాస్పిటల్‌ నందు డాక్టర్‌ రేవంత్‌ రెడ్డిని ‘ప్రజాశక్తి’ సంప్రదించగా పలు విషయాలు వెల్లడించారు. పక్షవాతం మొదటి మూడు గంటల్లో నయం చేయాలంటే అందుకు తగిన లక్షణాలను మొదట్లోనే గుర్తించడం చాలా ముఖ్యం. ఉన్నట్టుండి మాట తడబడినా, మూతి వంకర పోయినా, ఒక వైపు చెయ్యి కాలు రాకుండా తిమ్మిర్లు పట్టినట్లు అనిపించినా ఉన్నట్టుండి చూపు కనపడకుండా పోయిన, నడవడంలో బ్యాలెన్స్‌ తప్పిన పక్షవాతం వచ్చిందని గుర్తించాలి. ఈ లక్షణాలు కనిపించిన మొదటి మూడు గంటల్లో న్యూరాలజిస్ట్‌ను సంప్రదిస్తే వెంటనే మెదడును స్కాన్‌ చేసి రక్తపు గడ్డలు కరిగించే మందు ఇవ్వడం ద్వారా నయం చేయవచ్చు. మెదడులో ఒక భాగానికి ఉన్నట్టుండి రక్తప్రసరణ ఆగిపోతే పక్షవాతం వస్తుంది. సాధారణ ప్రజలతో పోలిస్తే మధుమేహం రక్తపోటు ఉన్న వారిలో, ఊబకాయం ఉన్నవారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంచుకోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, వ్యాయామం, సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా పక్షవాతం రాకుండా చేసే అవకాశం ఉంది. పక్షవాతం వచ్చిన రోగులు చెయ్యి కాలు బాగా రావడానికి ఫిజియోథెరపీ చేసుకోవడం, డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడటం ద్వారా సాధారణ జీవనశైలిని తిరిగి పొందవచ్చు. నాటుమందులు, పసరుమందులుపై ప్రామాణిక పరీక్షలు జరగనందున శాస్త్ర సమ్మతం కాదు. రేవంత్‌ న్యూరో కేర్‌ హాస్పిటల్‌ లో అత్యాధునిక న్యూరాలజీ సేవలు ఇప్పుడు తిరుపతిలో అందుబాటులో ఉంది. సంప్రదించు నెంబరు 9912806086, 0877 2226086. ప్రత్యేక వైద్య చికిత్సలు : పక్షవాతం , మూర్ఛ వ్యాధి , మైగ్రేన్‌ తలనొప్పి, టెన్షన్‌ తలనొప్పి, అన్ని ఇతర రకాల తలనొప్పులు నరములు, కండరాల బలహీనత, కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు, చక్కెర వ్యాధి సంబంధం నరాల జబ్బు, మెడ నడుము నరములు లాగుట, కళ్ళు తిరుగుట స్పృహ కోల్పోవటం, మూతి వంకర పోవుట, మెదడు వెన్నుపూస ఇన్ఫెక్షన్లు, చేతులు కాళ్లు వణుకుట , నిద్ర సమస్యలు, మయస్తీనియ గ్రేవిస్‌, మల్టిపుల్‌ స్క్లిరోసిస్‌, మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి వంటి వాటికి ప్రత్యేకమైన అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

➡️