శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులుప్రజాశక్తి- తిరుమల: ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను ప్రొఫెషనల్‌ పద్ధతిలో నిర్వహించామన్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవ్వడంతో తిరుమల శ్రీవారికి ధన్యవాదాలు చెప్పినట్లు తెలియజేశారు.ఏపీకి స్వర్ణయుగం: నటుడు శివాజీఏపీకి స్వర్ణయుగం మొదలైందని, కూటమి ప్రభుత్వంలో ఏపీ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని, శ్రీవారు ఇప్పుడు కళకళలాడుతున్నారని సినీ నటుడు శివాజీ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి దగ్గర డ్రామాలు చేస్తే ఇదే శిక్ష అన్నారు. పోలవరం, అమరావతిపై మాటిచ్చిన వారికి ఎలాంటి పాఠం నేర్పించారో అందరూ చూస్తున్నారని అన్నారు.

➡️