శుక్రవారం వేకువజామున 2.47 నిమిషములకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం…
ప్రజాశక్తి-సూళ్లూరుపేట : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట షార్ నుండి నేడు ఎస్ ఎస్ ఎల్ వి డి3 రాకెట్ ప్రయోగం జరగనున్నాయి. నేటి ఉదయం 9.17 గంటలకు శ్రీహరికోట నుంచి 3వ స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ను ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ శుక్రవారం వేకువ జామున 2. 47 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమై, 6.30 గంటలపాటు నిరంతరం కొనసాగిన, అనంతరం శుక్రవారం ఉదయం 9.17 గంటలకు ప్రయోగం జరుగుతుంది.ఈ ప్రయోగం భూ పరిశీలనలతో పాటు భూమికి దగ్గరగా అంతరిక్షంలో తిరిగి అవకాశం ఉన్న ఇఓఎస్ 08 ఉపగ్రహం రక్షణ రంగానికి కూడా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కీలకమైన ఉపగ్రహంలో అత్యంత ఆధునిక సాంకేతిక ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రయోగ కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను ఇస్రో అందరిని ఆహ్వానించి పూర్తి చేశారు. జండా పండుగ రోజున సాధారణంగా షార్ డైరెక్టర్ స్థానిక స్పేస్ సెంటర్ స్కూల్ ఆవరణలో జాతీయ పతాకం ఎగరవేసి విద్యార్థులు, శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతారు. అయితే ఈసారి రాకెట్ ప్రయోగం ఉన్న కారణంగా అదే సమయాన ఇస్రో చైర్మన్ ప్రయోగ ఏర్పాట్లును పర్యవేక్షించే విషయంలో శ్రీహరికోటలోనే ఉన్నారు. ఆయన రేపు జరిగే ప్రయోగాన్ని సహచర శాస్త్రవేత్తలతో కలిసి పర్యవేక్షించారు. ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని సోమనాథ్ ఎగరవేసి ప్రసంగం చేశారు.