‘స్వచ్ఛత’లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం : కలెక్టర్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ప్రతి ఒక్కరూ ‘స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత’ పై అవగాహనతో పాటు భాగస్వామ్యం ఉండాలని కలెక్టర్ ఎస్.వేంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా -2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ఎస్.వేంకటేశ్వర్, ఎంఎల్‌సి సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎం.ఎల్.ఏ సుగుణమ్మ, మున్సిపల్ కమిషనర్ ఎన్‌మౌర్య సంబందిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో చాలాకాలంగా పేరుకుపోయిన చెత్తను లక్ష్యంగా పెట్టుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకూ ప్రణాళాకాబద్దంగా కమిషనర్ చొరవతో శుభ్రంగా ఉంచామన్నారు. స్పెషల్‌డ్రైవ్ కింద దాదాపు 2015 టన్నుల చెత్తను తొలగించామన్నారు. జిల్లాలోని సుమారు 700 ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలను వాడకంలో తీసుకొచ్చి చెత్త నుండి సంపద సృష్టించాలన్నారు. తిరుపతి మున్సిపాలిటీ నందు మురుగునీటిని శ్రీకాళహస్తి ఎలెక్ట్రో క్యాస్టింగ్ వారికి విక్రయించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేరుకుతుందని తెలిపారు. మున్సిపల్ కమీషనర్ ఎన్. మౌర్య మాట్లాడుతూ గాంధీకి నివాళిగా స్వచ్చతాహిసేవా కార్యక్రమం ద్వారా గత రెండు వారాలుగా తిరుపతి పట్టణం నందు స్వచ్ఛత పై ప్రతి రోజు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పారిశుద్య కార్మికుల చేత పరిశుభ్రత చేయడం జరుగుతుందన్నారు. శానిటరీ వర్కర్స్ అందరు అంకిత భావంతో వారి యొక్క విధులను నిర్వహించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మాజీ తుడ చైర్మన్ నరసింహ యాదవ్, డి.ఎం.అండ్ హెచ్ ఓ శ్రీహరి, మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు, సంబందిత అధికారులు, విద్యార్థులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం : మేయర్ అహింసే ఆయుధంగా మన దేశానికి స్వాతంత్రం సాధించిన జాతిపిత గాంధీజీ అడుగుజాడల్లో అందరూ నడవాలని నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్. మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అధికారులు గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తిరుపతి పట్టణాభివద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా స్వరాజ్య స్థాపనకు అందరూ కషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో తుడా సెక్రటరి వెంకట నారాయణ, ఎస్.ఈ. కష్ణారెడ్డి, ఈ.ఈ.రవీంద్రయ్య, పి.ఓ.దేవి కుమారి, ఏఏఓ సుగుణ, తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం విద్యతోనే సాధ్యమని ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్‌రాజు అన్నారు. రేణిగుంట బస్టాండ్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.