‘ఈవో అంకుల్‌’ మా కుటుంబాలను ఆదుకోండికృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారుల వినూత్న నిరసన

'ఈవో అంకుల్‌' మా కుటుంబాలను ఆదుకోండికృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారుల వినూత్న నిరసన

‘ఈవో అంకుల్‌’ మా కుటుంబాలను ఆదుకోండికృష్ణుడు, గోపిక వేషధారణలో చిన్నారుల వినూత్న నిరసన ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌శ్రీవారి మెట్టు మార్గంలో ఉండే చిరు వ్యాపారస్తుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందు గత ఆరు రోజుల నుండి ఆందోళన జరుగుతోంది. వారికి మద్దతుగా ఆయా కుటుంబాల్లో ఉన్న చిన్నపిల్లలు కష్ణాష్టమి జయంతి సందర్భంగా కష్ణులు, గోపికలు వేషధారణలో వచ్చి ‘ఈవో అంకుల్‌ మా కుటుంబాలను ఆదుకోండి’ అంటూ ప్లకార్డులతో నిరసనలో పాల్గొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.జయచంద్ర మాట్లాడుతూ చిరు వ్యాపారుల సమస్యలను టిటిడి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చిన్నారులు సైతం నిరసనలో భాగస్వాములైనా యాజమాన్యానికి దయలేకుండా పోయిందన్నారు. ఎర్రచందనం దొంగలను పట్టించడంలో, సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో వీరి పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్‌, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం పాల్గొన్నారు.

➡️