‘ఉద్యమ్’ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పరిశీలనప్రజాశక్తి – తిరుపతి టౌన్ తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం బాలాజి కాలని, టౌన్ క్లబ్ తదితర ప్రాంతాల్లో సచివాలయం కార్యదర్శులు నిర్వహిస్తున్న ఈ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ”ఉద్యమ్” అనే పోర్టల్ ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. ఉద్యమ్ పోర్టల్ నందు వివరాలను నమోదు చేసుకోవడం వలన వివిధ చిన్న, మధ్య తరగతి ప్రభుత్వ పథకాలు, రాయితీలు సులభంగా పొందవచ్చు అన్నారు. కమిషనర్ వెంట డిఈ మధు బాబు, సచివాలయం కార్యదర్శులు సురేష్, లోకేష్ ఉన్నారు.