మత్స్యకారులు సురక్షితం : కలెక్టర్‌

మత్స్యకారులు సురక్షితం : కలెక్టర్‌

మత్స్యకారులు సురక్షితం : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా కాపాడి కష్ణపట్నం పోర్ట్‌కు చేర్చామని కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్‌ తీవ్రతరం అవుతుందని, ఈ ప్రభావం వలన ఈ నెల 26 నుండి 28 వరకు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తుగా మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అయినప్పటికీ నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది(9)మంది మత్స్యకారులు మెకనైజేడ్‌ బోట్‌లో వెళ్లారు. తిరుపతి తీరం వాకాడు మండలంలోని వడపాలెం, వై.టి.కుప్పానికి సముద్రంలో 14 కిలో మీటర్ల దూరంలో బోట్‌ ఇంజను పాడైపోవడంతో బోట్‌ లో ఉన్న జాలర్ల నుండి అందిన సమాచారం మేరకు మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్‌ సత్వరమే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించి సంబంధిత నేవీ, కోస్ట్‌ గార్డ్‌ అధికారులు వెంటనే పెద్ద పడవల సహాయముతో దుగ్గరాజపట్నం వద్ద చిక్కుకుపోయిన ఐఎన్‌డిటిఎన్‌ 02 ఎంఎం 2588 బోట్‌తో పాటు బోగోలు మండలం పాతపాలెం, చెన్నరాయునిపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులను సురక్షితంగా బుధవారం ఉదయం 10 గంటలకు కష్ణపట్నం చేర్చారు. ఈ సందర్భంగా సదరు మత్స్యకారులు వెంటనే స్పందించి తమను కాపాడిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌కు యంత్రాంగానికి కతజ్ఞతలు తెలిపారు. రెస్క్యూ చేయబడిన మత్స్యకారుల వీరే:సీహెచ్‌.రమేష్‌, కె. ఏడుకొండలు, కె.చిట్టిబాబు, కె.తిరుపతి, వి.హరి బాబు .వై.అరవండి, కె.వెంకట రమణయ్య, సి.హెచ్‌ శివాజీ, ఎ.తిరుపతి.కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 0877 2256766తుపాను వల్ల ప్రజలకు సహాయ చర్యలు అందించేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని కమిషనర్‌ ఎన్‌.మౌర్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్‌ రూము నందు 24 గంటలు నగరపాలక సంస్థ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. తుఫాను వలన ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్‌ రూము నంబర్‌ 0877 2256766 ను సంప్రదించాలని అన్నారు. రెండు రోజుల పాటు వర్షాలు ఎక్కువగా కురవనున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి సహాయక చర్యలకైనా కంట్రోల్‌ రూము ను సంప్రదించాలని కోరారు.

➡️