ముంపువానపాఠశాలలకు ముందస్తు సెలవుజలపాతాల వద్దకు ‘నోఎంట్రీ’అధికార యంత్రాంగం అప్రమత్తంజిల్లా ప్రజానీకానికి తుపాను హెచ్చరికలు జిల్లా ప్రజానీకానికి ముందస్తు తుపాను హెచ్చరికలు చేస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, అంగన్‌వాడీ స్కూళ్లకు సోమవారం ఉదయమే ముందస్తు సెలవు ప్రకటించింది. మంగళ, బుధవారం కూడా ఈ సెలవు కొనసాగే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ప్రకటించలేదు. జిల్లాలో జలపాతాల వద్దకు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లరాదని ‘నో ఎంట్రీ’ బోర్డులను పెట్టింది. మంగళ, బుధ, గురువారాల్లో వర్షం మరింత ఎక్కువగా ఉండనుంది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు తుఫాన్ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమీక్షలో జేసీ శుభం బన్సల్, డిఆర్‌ఒ పెంచలకిషోర్ పాల్గొన్నారు.ప్రజాశక్తి – తిరుపతి టౌన్, యంత్రాంగం బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన కురిసే వర్షాలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా హెల్ప్ లైన్ నంబర్ 0877 2256766 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ప్రజలను కోరారు. సోమవారం తెల్లవారుజాము నుంచి కమిషనర్ ఎన్.మౌర్య మురుగు కాల్వల్లో పూడిక తీత పనులను చేపట్టారు. పేరూరు చెరువు నుంచి నీరు వచ్చే ప్రాంతాలను, కపిలతీర్థం, మాల్వాడిగుండం నుండి నీరు వెళ్లే ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలైన కొరమేనుగుంట, గొల్లవానిగుంట, జీవకోన ప్రాంతాల్లోని ఇంజినీరింగ్, హెల్త్, టౌన్‌ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో ఎక్కడా వర్షపునీరు నిలవకుండా సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మురుగుకాలువల్లో వర్షపునీరు నిలవకుండా, రోడ్లపైకి నీరు రాకుండా ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఆర్డీవో రామ్మోహన్, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఇరిగేషన్ ఎస్.ఈ. శివారెడ్డి, అర్బన్ , రూరల్ తహసీల్దార్లు భాగ్యలక్ష్మి, రామాంజులు నాయక్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, సి.పి.ఓ. దేవి కుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఉన్నారు.డివిజన్ల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు : సిఎండితిరుపతి సిటీ : తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వుండాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిఎస్ పిడిసిఎల్ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల పరిధిలో తుఫాను కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. సంస్థ పరిధిలో సర్కిల్స్, డివిజన్స్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షం కురుస్తున్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకవద్దని, లైన్ల కింద నిల్చో వద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపడడంలాంటి సంఘటనలను గుర్తించినట్లయితే తక్షణమే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు/ సిబ్బందికిగానీ లేదా టోల్ ఫ్రీ నంబర్లు:1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా సంస్థ వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు.సముద్రతీర ప్రాంతాల్లో అప్రమత్తం కోట : సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోట తహశీల్దార్ కటారి జయజయరావు అన్నారు. సోమవారం శ్రీనివాససత్రం, కొత్తపట్నం, రుద్రవరం, ఊనుగుంటపాలెం గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో కలిసి పర్యటించారు. మత్స్యకారులకు అవగాహన కల్పించారు. చేపల వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. విఆర్‌ఒ శ్రీనివాసులు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, మండల మత్స్యశాఖ అధికారి రెడ్డినాయక్, మండల సర్వేయర్ గోపిరెడ్డి పాల్గొన్నారు.తుఫాన్ పునరావాస కేంద్రాలకు వెళ్లాలి : తహశీల్దార్ శైలకుమారిదొరవారిసత్రం: అత్యవసర పరిస్థితిలో లోతట్టుప్రాంతాల ప్రజలు పునరాసవాస కేంద్రాలకు వెళ్లాలని దొర వారి సత్రం తాసిల్దార్ శైలకుమారి గిరిజనులకు తెలియజేశారు. తాసిల్దార్ శైలకుమారి ఎంపీడీవో గోవర్ధన్, ఎస్సై అజరు కుమార్ సోమవారం మండల పరిధిలోని లోతట్టు మునక ప్రాంతాలను సందర్శించారు. తనియాలి దళిత వాడ, గిరిజన కాలనీ, వేటగిరి పాలెం, బురద మడుగు గ్రామాల్లో నీటి ప్రవాహ ప్రాంతాలను పరిశీలించారు.
ముంపువానపాఠశాలలకు ముందస్తు సెలవుజలపాతాల వద్దకు ‘నోఎంట్రీ’అధికార యంత్రాంగం అప్రమత్తంజిల్లా ప్రజానీకానికి తుపాను హెచ్చరికలు
