‘రియల్‌’ రిజి’స్ట్రారు’! రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టుకు భలే పోటీరూ.2 కోట్లకు పైనే డిమాండ్‌

'రియల్‌' రిజి'స్ట్రారు'! రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టుకు భలే పోటీరూ.2 కోట్లకు పైనే డిమాండ్‌

‘రియల్‌’ రిజి’స్ట్రారు’! రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టుకు భలే పోటీరూ.2 కోట్లకు పైనే డిమాండ్‌కొన్ని పోస్టులు అక్రమాలకు కల్పతరువు.. రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టు కూడా అలాంటిదే.. ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టు కోసం తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన సబ్‌ రిజిస్ట్రార్లు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోస్టు దాదాపు రెండు కోట్లు పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆశావాహులు ఎంఎల్‌ఎలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి జిల్లా ఏర్పడిన తరువాత రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టుకు ప్రాధాన్యత పెరిగింది. గతంలో పనిచేసిన సబ్‌ రిజిస్ట్రార్లు భారీఎత్తున ముడుపులు చెల్లించి ఈ పోస్టుల్లో చేరారన్న చర్చ నడిచింది. అంతేస్థాయిలో వారిపై అవినీతి ఆరోపణలూ వెల్లువెత్తాయి. వైసిపి హయాంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆనందరెడ్డిపై అప్పట్లో పలు ఆరోపణలూ వచ్చాయి. ప్రభుత్వ భూముల విలువ 400 శాతం పెంచేయడమే కాకుండా, వివాదాస్పదమైన భూములను రిజిస్ట్రేషన్‌ చేశారన్న ఆరోపణలతో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. తరువాత ఆయన స్థానంలో కడప జిల్లా హేమలత చేరారు. ఆమె కూడా ఏ ఒక్క రిజిస్ట్రేషన్‌ ముడుపులు లేకుండా చేయలేదన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ రూపంలో రావాల్సిన ఫీజులు దాదాపు 20 లక్షలు చెల్లించకుండానే స్వాహా చేసిన విషయమూ అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఈ కార్యాలయంలో దళారులదే హవా. డికెటి స్థలాలతో పాటు కాల్వ పోరంబోకు, కుంట పోరంబోకు, అటవీ స్థలాలు, 22ఎ పరిధిలో ఉన్న స్థలాలూ రిజిస్ట్రేషన్‌ చేయించడంలో ఇక్కడి దళారులు అందెవేసిన చేయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం ఎన్నోమార్లు దాడులు చేసి, డబ్బులు సీజ్‌ చేశారే తప్ప చర్యలు శూన్యమనే చెప్పాలి. రేణిగుంట మండలంలో ఇండిస్టియల్‌ బెల్ట్‌ ఉంది. అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. విద్యాసంస్థలూ ఉన్నాయి. వివామనాశ్రయ చుట్టుపక్కల భూములకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక్కడ రోజుకు 25-40 రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. భూముల మార్కెట్‌ వాల్యూని బట్టి రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు మామూళ్ల రూపంలో ఒక శాతం వారికి ఇస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తారంటే అవినీతి ఏ విధంగా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఉన్నతాధికారులకు తెలిసినా షరా’మామూలే’.. ప్రస్తుతం ఇంతటి ప్రాధాన్యత గల రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టు ఖాళీగా ఉండటం అక్రమార్కుల పోటీకి తెరలేచింది. రూ.2 కోట్లకు పైనే ఈ పోస్టు రేటింగ్‌ ఉందని విశ్వసనీయ సమాచారం. మరి ఏ రిజిస్ట్రార్‌ దక్కించుకుంటారో మరి.

➡️