ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయ మాజీ ఈఓ పోలి సుబ్రమణ్యం గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కార్పొరేటర్ ఆర్.సీ. మునికృష్ణ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
