గుండెపోటుతో గోపాల్ రెడ్డి పాలెం సర్పంచ్ మృతి 

Jan 9,2025 10:02 #Tirupati district

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : పట్టుమని నాలుగు పదుల వయస్సు కూడా లేని గోపాల్ రెడ్డి పాలెం సర్పంచ్ నెల్లిపూడి పోలా ప్రసాద్ గుండెపోటుకు గురై మృతి చెందడం స్థానికులను కలవరానికి గురి చేసింది. సూళ్లూరుపేట మండలం గోపాల్ రెడ్డి పాలెం గ్రామానికి చెందిన నెల్లిపూడి పోలా ప్రసాద్ (37)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి ఛాతిలో నొప్పిగా ఉందంటూ కుటుంబ సభ్యులు తెలపడంతో ప్రసాద్ ను వెంటనే సూళ్లూరుపేటలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో ప్రసాద్ మృతి చెందాడు. విషయం తెలయగానే కుటుంబ సభ్యులు గ్రామస్తులు కన్నీటి పరమయ్యారు. ప్రసాద్ కు గ్రామంలో మంచి పేరు ఉండడం ఎవరికీ ఆరోగ్యం సరిగా లేకపోయినా తన సొంత డబ్బుతో బాగు చేయించడం గ్రామంలో చిన్న వయసులో సర్పంచ్ గా ఎన్నో మంచి పనులు చేసిన పేరు ఉండటంతో అతను చనిపోయాడు అన్న మాట గ్రామంలో జీర్ణించు కోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరు అవుతున్నారు. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది.

➡️