పాండూరులో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

Oct 2,2024 23:56
పాండూరులో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

పాండూరులో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంప్రజాశక్తి – వరదయ్యపాలెం పాండూరులో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. ‘ప్రభుత్వ భూముల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు చేపడతాం’ అని రెవెన్యూ అధికారుల హెచ్చరిక నోటీసులను సైతం కబ్జాదారులు లెక్క చేయడం లేదు. రెవెన్యూ అధికారులు సైతం కబ్జాదారుల కొమ్ముగాస్తూ ప్రభుత్వ భూములను కాపాడటం లేదన్న విమర్శలూ లేకపోలేదు. వరదయ్యపాలెం మండలం పాండూరు రెవెన్యూలోని సర్వే నంబర్‌ 915లో 4.26 ఎకరాలకు హద్దులు ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గతంలో ఈ భూముల్లో 1.70 ఎకరాలకు సంబంధించి నకలీ పట్టాలను అధికారులు రద్ధు చేశారు. ప్రస్తుతం ఈ భూముల్లో అక్రమంగా ప్రవేశిస్తున్న కబ్జాదారులు రెవిన్యూ అధికారులకు తాయితాలు సమర్పించుకుని నకిలీ పట్టాలను పొందాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. హెచ్చరిక బోర్డులను సైతం లెక్క చేయడం లేదు. మండల రెవెన్యూ అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

➡️