గంజాయి పై దృష్టి పెట్టాండిజిపి ద్వారకా తిరుమలరావు ప్రజాశక్తి- తిరుపతి సిటీ: ప్రతి జిల్లాలో పోలీసులకు నేరపరిశోధనపై అవగాహన కల్పిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నిర్మూలనపై ఎక్కువ దష్టి పెట్టామని రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు తెలిపారు. తిరుపతి పర్యటన భాగంగా స్థానిక పోలీస్ అతిథి గహంలో శనివారం ఆయన కర్నూల్ రేంజ్, అనంతపురం రేంజ్ ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అనంతపూర్, కర్నూల్ రేంజ్‌లో నేరాల అదుపు, శాంతి భద్రతలను కాపాడే విధానం, స్థానిక సమస్యలపై అన్ని జిల్లాల అధికారులతో కూలంకుషంగా చర్చించామన్నారు. కొంతకాలంగా జిల్లాల్లో ఉన్న సవాళ్లపై చర్చించుకోవడం జరిగిందన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి అవసరమైన కొన్ని వనరులు సరిగా లేవని, వాటిలో ముఖ్యంగా వాహనాలు పాతబడ్డాయి త్వరలో వాహనాలు సమకూరుస్తామని తెలిపారు. చిన్న చిన్న సర్వీస్ మేటర్సు విషయంలో ఒక ప్లాన్ ప్రకారం వెళ్లి సరి చేసుకుంటామని, సంక్షేమ విషయం సిబ్బందికి బాగా చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో బేసిక్ పోలీస్ బాగా చేయాలని కోరుకుంటున్నామని, పోలీస్ సిబ్బందితోపాటు ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు కూడా బేసిక్ పోలీసింగ్ చేసుకుంటూ ఉండాలని, త్వరలో పోలీసులను రిక్రూట్ చేస్తామని కొంత టైం పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, మానవ హక్కులను గౌరవిస్తూ, చట్టాన్ని దుర్వినియోగం చేయకూడడని, ప్రస్తుతం గంజాయి మీద నూరు రోజులు ప్రణాళిక రూపొందించామన్నారు. గంజాయి మాదకద్రవ్యాలపై ప్రజలకు, చిన్నపిల్లలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లాల్లో ఉన్న సవాళ్ళను పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కోంటున్నామని, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు శ్రద్ధ పెడతామన్నారు. అమాయక గిరిజనులను వాడుకుని గంజాయి సాగు చేయిస్తున్నారు. దాని పై ప్రత్యేక దష్టి సారించి త్వరలోనే అరికడతామన్నారు. గంజా ట్రాన్స్పోర్ట్ ఆపాలని చూస్తున్నామని, ప్రజలకు సమాజానికి జవాబుదారీతనంగా ఉంటామని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకొని గంజా పంటను గుర్తించి నిర్మూలిస్తామని, చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తామని, గంజా నిర్మూలన కొరకు ఏటీఎఫ్ (యాంటీ టాస్క్ ఫోర్స్) టీములను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త చట్టాల గురించి అన్ని పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయని, ఎర్రచందనం అక్రమ రవాణాపై రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందన్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెముషి బాజ్పేయి, తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కష్ణారావు, కర్నూలు జిల్లా ఎస్పీ కష్ణకాంత్, కడప జిల్లా ఎస్పి సిద్ధార్థ కౌశల్, సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి హాజరయ్యారు.
