ప్రత్యేక ప్రతిభావంతుల కోసం హీరో పరిశ్రమ ముందడుగు

Jan 9,2025 01:11
ప్రత్యేక ప్రతిభావంతుల కోసం హీరో పరిశ్రమ ముందడుగు

ప్రత్యేక ప్రతిభావంతుల కోసం హీరో పరిశ్రమ ముందడుగుప్రజాశక్తి సత్యవేడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి హీరో పరిశ్రమ జూఉ కిరణ్లివివిధ కారణాలవల్ల, ప్రమాదాల వల్ల అవిటితనం బారిన పడ్డ ప్రత్యేక ప్రతిభావంతులకు చేయూతనివ్వడానికి సిద్ధమైన హీరో పరిశ్రమలిసత్యవేడు నియోజకవర్గం లోని హీరో పరిశ్రమ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపార లావాదేవీలే కాకుండా స్థానిక ప్రజల కోసం ప్రత్యేకమైన సేవా కార్యక్రమాల విభాగాన్ని ఏర్పాటు చేసి విపత్తుల సమయంలో నిరుపేదలకు సహాయం చేస్తూ …. నిరుపేద కుటుంబాలలో చదువుల తల్లి సరస్వతి ఒడికి దూరమైన పిల్లలకు చేయూతనిస్తూ …. ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతు చేస్తూ…. పలు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సామాగ్రిని అందిస్తూ …. తమ సేవా భావాన్ని చూపుతున్న వైనం స్థానికంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే..,అదేవిధంగా ప్రస్తుతం వివిధ కారణాల వల్ల ప్రమాదాలకు గురై అవిటితనంతో బాధపడుతున్న ప్రత్యేక ప్రతిభావంతులకు తమ పరిశ్రమ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో నిర్ణయానికి వచ్చిన అనంతరం …నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక ప్రతిభావంతుల జాబితాను స్థానిక పలు సంస్థల ద్వారా సేకరిస్తున్నట్లు సమాచారం….త్వరలో నడవలేని స్థితిలో ఉన్న వారికి మోటార్ ట్రై సైకిల్, సరిగా వినపడక చెవిటితనంతో బాధపడుతున్న వారికి వినికిడి పరికరం ఇవ్వనున్నట్లు సమాచారం…ఈ కార్యక్రమం కోసం హీరో పరిశ్రమ జూఉ కిరణ్ గారిని నియమించినట్లు సమాచారం…..ఎవరైనా వినికిడి పరికరం, మోటర్ ట్రై సైకిల్ కావాల్సినవారు ఈ నెంబర్ కి సంప్రదించగలరు…8008248546

➡️