ఆధిపత్యం కోసమేనా…!’హిజ్రాల’ లీడర్‌ హాసిని హత్యగతంలోనూ రెండుసార్లు దాడికన్నీరుమున్నీరైన హిజ్రాలు’మంగళం’లో పూర్తయిన అంత్యక్రియలు

ఆధిపత్యం కోసమేనా...!'హిజ్రాల' లీడర్‌ హాసిని హత్యగతంలోనూ రెండుసార్లు దాడికన్నీరుమున్నీరైన హిజ్రాలు'మంగళం'లో పూర్తయిన అంత్యక్రియలు

ఆధిపత్యం కోసమేనా…!’హిజ్రాల’ లీడర్‌ హాసిని హత్యగతంలోనూ రెండుసార్లు దాడికన్నీరుమున్నీరైన హిజ్రాలు’మంగళం’లో పూర్తయిన అంత్యక్రియలుప్రజాశక్తి – తిరుపతి సిటి, తిరుపతి (మంగళం)హిజ్రాల అసోసియేషన్లో ఆధిపత్యం కోసమే హాసిని హత్యకు గురైందని చర్చ నడుస్తోంది. ఉమ్మడి తెలుగురాష్ట్రంలో హాసిని ఎదుగుదల చూసి ఓర్వలేక కొంత మంది ప్రత్యర్దులు కక్ష కట్టారని, ఎలాగైనా అడ్డు తొలగించాలని పథకం ప్రకారమే హత్య చేసినట్లు ఆమె అనుచరం వర్గం ఆరోపిస్తోంది. ఇందుకు గతంలో రెండుసార్లు ఆమెపై జరిగిన దాడే నిదర్శనం. హసిని హత్య రాయలసీమలోని హిజ్రాలను శోకసముద్రంలో ముంచేసింది. హాసిని చురుకైన, తెలువైన వ్యక్తి. హిజ్రాలకు సమాజంలో గుర్తింపు తీసుకొచ్చేందుకు, ఎదుట వ్యక్తులు తక్కువ భావంతో చూస్తున్న సమయంలో, ఉపాధి అవకాశాలు కూడా దుర్లభమైన పరిస్థితుల్లో ప్రతి హిజ్రా తమ సొంత కాళ్లపై తాము నిలబడుకుని, ఎవరిపై ఆధారపడకుండా జీవనం సాగించాలని తలిచింది. తిరుపతి కేంద్రంగా అనేక మంది హిజ్రాలను పోగు చేసి, మంగళం ప్రాంతంలో వారికంటూ ప్రత్యేకంగా ఓ వసతిగృహాన్ని ఏర్పాటు చేసింది. హిజ్రాల అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి, చదువుకున్న అనేక మంది హిజ్రాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేసింది. చదువు రాని, ఎలాంటి ఆధారం లేని వారికి అన్నీ తానై పలువురు దాతల సహయంతో వారి జీవితాలకు ఓ ఆసరాగా నిలిచింది. సుమారు మూడు దశాబ్దాలకు పైగా తిరుపతి, నెల్లూరు, అనంతపురం, చుట్టుపక్కల జిల్లాల హిజ్రాలకు పెద్దదిక్కుగా నిలిచింది. తిరుపతి నగరం నుంచి జిల్లా, రాష్ట్రం, దక్షినాధి రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో అసోసియేషన్‌ నాయకురాలి స్థానానికి ఎదిగింది. ప్రతి నెలా దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో జరిగే హిజ్రాల సమావేశానికి క్రమం తప్పకుండా వెళ్ళుతూ హిజ్రాల సమస్యలు, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే చర్చించేవారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ ఇతర ప్రాంతాల్లో లాగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకూడకుదని హుకుంజారీ చేసి, తన వారిని సతప్రవర్తనగా ఉండేలా మలిచింది. ఆమె పోరాట ఫలితంగా ప్రణాళిక బద్దమైన పద్దతుల ద్వారా నగరంలోని హిజ్రాలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనగలిగారు. ఈ నేపథ్యంలో ఆమె కృషి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. నెల్లూరు కేంద్రంగా కొంత మంది మగవాళ్లే ఉద్దేశపూర్వకంగా హిజ్రాలమని చెప్పుకుంటూ ప్రజల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు, కొంత మంది హిజ్రాలను సైతం తమవైపుకు తిప్పుకుని, వారి ద్వారా దందాలు చేసేవారు. దీన్ని ఆమె ప్రతిఘటించడంతో గతంలో ఒకసారి ఆమెపై దామినేడు సమీపంలో దాడికి దిగారు. అయినా ఆమె వెరవకుండా అసోసియేషన్‌ను ముందుకు తీసుకెళ్లేది. ఆమె ఎదుగుదలను ఓర్వలేక కొంత మంది ఈర్ష్య పెంచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో సైతం హాసిని కార్యక్రమాలు విస్తృతం చేయడంతో అక్కడి వారు ఈమెపై మరింత కక్ష పెంచుకున్నారు. ఆధిపత్యం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. గతంలో ఓ సారి నెల్లూరులోని హిజ్రాల కాలనీలో ఆమెపై దాడికి దిగారు. అనుచరులు పెద్ద ఎత్తున గుమిగూడి ఎదుర్కొవడంతో పారిపోయారు. తాజాగా మంగళవారం రాత్రి నెల్లూరు సమీపంలోని ఓ గుడిలో పూజ కోసం వెళ్లిన ఆమెపై నిఘా ఉంచి, వెంటబడి, అదును చూసి కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిజ్రాలు ఆయా ప్రాంతాల్లో హాసినిని హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. హాసిని హత్యకు సొంత వారే ఉప్పందించి ఉండవచ్చని ఆమె అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దీనిపై పూర్తి విచరణ జరిపి, న్యాయం చేయాలని హిజ్రాలు కోరుతున్నారు. మంగళంలో ముగిసిన హాసిని అంత్యక్రియలు మంగళవారం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, టపాతోపు వద్ద హిజ్రా లీడర్‌ హాసినిని అతి దారుణంగా హత్య చేశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన హిజ్రాల ముఖ్య లీడర్‌ గా ఎదుగుతున్న హాసినిని హత్య చేశారని తెలియడంతో హిజ్రాలు వందలాదిగా నెల్లూరు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. నెల్లూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం తిరుపతి జిల్లా మంగళం పరిధిలోని మంగళం గ్రామపంచాయతీ నారా చంద్రబాబునాయుడు కాలనీకి తీసుకొచ్చారు. అశ్రునయనాల మధ్య హాసిని అంత్యక్రియలు మంగళం స్మశాన వాటికలో ముగిసాయి. రాయలసీమ టైగర్‌ ఇక నువ్వు లేవు అని నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని హిజ్రాలు కన్నీరు మున్నీరుగా విలపించారు.హత్య ఘటనపై నెల్లూరు జిల్లా కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. హాసిని మతదేహానికి మంగళం పంచాయతీ టీడీపీ నాయకులు సురేష్‌ నాయుడు, భాస్కర్‌ రెడ్డి, జనసేన నాయకులు సాయి, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️