బరితెగింపు పులివర్తి నాని పై దాడిత్రుటిలో తప్పిన ప్రాణాపాయంగన్‌మెన్‌ ధరణికి తీవ్రగాయంఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న నానిమహిళ యూనివర్సిటీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత, 144 సెక్షన్‌ అమలు

బరితెగింపు పులివర్తి నాని పై దాడిత్రుటిలో తప్పిన ప్రాణాపాయంగన్‌మెన్‌ ధరణికి తీవ్రగాయంఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న నానిమహిళ యూనివర్సిటీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత, 144 సెక్షన్‌ అమలు

బరితెగింపు పులివర్తి నాని పై దాడిత్రుటిలో తప్పిన ప్రాణాపాయంగన్‌మెన్‌ ధరణికి తీవ్రగాయంఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న నానిమహిళ యూనివర్సిటీ ఎదుట తీవ్ర ఉద్రిక్తత, 144 సెక్షన్‌ అమలుప్రజాశక్తి – తిరుపతి: చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై వైసీపీ అనుయాయులు తీవ్ర దాడికి పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎదుట చోటుచేసుకుంది. స్ట్రాంగ్‌ రూములను పరిశీలించేందుకు వస్తున్న పులివర్తి నాని కారును అడ్డగించిన దుండగులు మారణాయుధాలతో సమ్మెట (భారీ సుత్తి), కత్తి, రాడ్లు, బీరు బాటిల్లు, క్రికెట్‌ స్టిక్స్‌, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. నాని పై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన గన్మెన్‌ ధరణి పైన విచక్షణారహితంగా సమ్మిటితో దాడి చేశారు. దుండగులు విసిరిన రాళ్లు నాని ఛాతికి తగలడంతో ఆయన అస్వస్థకు గురి అయ్యారు. ఆ కారులోనే ఉన్న ఆయన సతీమణి సుధారెడ్డి పైకి వైసిపి అనువాయిలు బీరు బాటలతో దాడికి ప్రయత్నించారు. దీంతో అప్పటికే తీవ్ర రక్తగాయంతో ఉన్న గన్మెన్‌ ధరణి ఆత్మరక్షణ కోసం ఒక రౌండ్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ వెనుకాడన్ని దుండగులు 20 నిమిషాల పాటు రాళ్ల వర్షం కురిపించారు. దీంతో నాని ప్రయాణిస్తున్న వాహనంతో పాటు మరో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు సైతం పెద్దఎత్తున చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు పోలీసు బలగాలను పెద్ద ఎత్తున రంగంలోకి దించారు. పోలీసులు ఇరు వర్గాలను చదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన పులివర్తి నాని, ఆయన గన్మెన్‌ ధరణిలను హుటాహుటిన స్విమ్స్‌కు తరలించి వైద్యచికిత్స అందిస్తున్నారు. పోలీసులకు అందిన ఘటన వీడియోల ఆధారంగా దాడికి పాల్పడింది రామచంద్రాపురం మండలం వైసిపి జడ్పిటిసి భానుప్రకాష్‌ (భాను)గా గుర్తించారు. ముందస్తు ప్రణాళిక మేరకే తన అనుయాయులతో కలిసి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ దాడిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు తీవ్రంగా ఖండించారు. చంద్రగిరిలో తెలుగుదేశం గెలుస్తుందన్న భయంతోనే కక్షగట్టి నానిపై చెవిరెడ్డి దాడి చేయించారంటూ ఆరోపించారు.పోలీసుల వైపల్యం..!పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో పోలీసుల వైపలంపై తీవ్ర దుమారం రేగుతొంది. ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్లు ఉన్న శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీ వద్దనే మారణాయుధాలతో బాడికి పాల్పడటంపై పోలీసుల తీరు పైనా సందేహాలు వెల్లువెత్తుతున్నాయంటూ కూటమి నేతలతో ఆరోపిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఉన్నాయంటూ చెబుతున్న మహిళ యూనివర్సిటీలోకి మారణాయుధాలు ఎలా వచ్చాయంటూ వామపక్ష నేతల సైతం ప్రశ్నిస్తుండడం గమనార్హం. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.మళ్లీ లాఠీ చార్జీశ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, అటు టిడిపి ఇటు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో వారిని చదరగొట్టేందుకు మరోసారి లాఠీ ఛార్జ్‌ చేశారు. అయితే పోలీసులు ఒక వర్గానికి చెందిన వారినే చదరగొడుతున్నారని మరోవర్గం విమర్శలు గుప్పించింది. ఇదే సందర్భంలో వీటన్నింటినీ కవరేజ్‌ చేస్తున్న మీడియా ప్రతినిధుల పైన లాఠీలు ఝులిపించడం గమనార్హం.రామిరెడ్డిపల్లి ఘటనకు ప్రతిగానే వైసిపి దాడినా?చంద్రగిరి నియోజక వర్గంలోని రామిరెడ్డిపల్లిలో సోమవారం రాత్రి జరిగిన దాడికి ప్రతిగానే టిడిపి అభ్యర్థి నానిపై వైసీపీ అనుయాయులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రామిరెడ్డిపల్లి పోలింగ్‌ బూత్‌లో ఏర్పడ్డ వివాదం కాస్త పెద్దదై వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి కారుపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడే వరకు వచ్చింది. దాదాపు గంటపాటు ఆయనను నిర్బంధించి, వైసీపీ ఏజెంట్‌గా ఉన్న చంద్రశేఖర్‌ రెడ్డి ఇంటిని కాల్చివేశారు. అయితే జిల్లా కలెక్టర్‌ చొరవతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. అయితే ఆ దాడికి ప్రతిగానే మంగళవారం సాయంత్రం టిడిపి అభ్యర్థి నానిపై దాడికి పాల్పడినట్లు పోలీసుల సైతం అనుమానిస్తున్నారు.తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పాటిల్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పద్మావతి యూనివర్శిటి పరిధిలో పరిస్థితి అదుపులో ఉందని, 144 సెక్షన్‌ అమలు చేయడం జరుగుతోందని, ఎవరూ ఇటువైపు రావొద్దు అని హెచ్చరించారు. మీడియా వ్యక్తులు సైతం ఇటు రావొద్దు అని సూచించారు.మీడియాపై దాడి దారుణంసిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు చిత్తూరు అర్బన్‌: తిరుపతి మహిళా యూనివర్సిటీ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు, మీడియా మిత్రులు, సామాన్యులపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని చిత్తూరు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడికి నిరసనగా జరుగుతున్న ఆందోళనను కవర్‌ చేస్తున్న మీడియా మిత్రులపై లాఠీఛార్జీ చేయడం దుర్మార్గమన్నారు. అదే ప్రాంతంలో సామాన్యులను కూడా పోలీసులు లాఠీఛార్జీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.నానిపై దాడి హేయమైన చర్య…చిత్తూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌వైసీపీ కుట్ర పూరిత రాజకీయాలకు స్వస్తి పలికే రోజులు సమీపంలోనే ఉన్నాయని, వైసీపీ లాంటి అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నిన్ననే ప్రజలంతా తమ ఓటుతో ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నిర్ణయించారని చిత్తూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ అన్నారు. ఓటమి భయంతో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, తన తండ్రి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై సుత్తి, గొడ్డలి, కొడవళ్ళతో దాడి చేసి హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.తిరుపతిలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలి..సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళితిరుపతి సిటీ: చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ గుండాల హత్యాప్రయత్నం దాడిని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి డిమాండ్‌ చేశారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలోని ఈవీఎం స్ట్రాంగ్‌ రూముల వద్ద వైసీపీ గుండాలు నానిపై జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తిరుపతి నగరంలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. నానిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీకాళహస్తి: తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు వెళ్లిన చంద్రగిరి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ అల్లరి మూకలు కత్తులు, రాడ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. ఓడిపోతాం అనే భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారనీ, దీన్ని ప్రజాస్వామ్య వాదులందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్‌ కమిషన్‌ నానిపై దాడిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.పులివర్తి నాని పై దాడికి సిపిఎం ఖండన తిరుపతి టౌన్‌: చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపిఎం) తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ సంఖ్యలో ఇతరులను సంఘ వ్యతిరేక శక్తులను అనుమతించడం గొడవలు జరగడానికి అవకాశం కల్పించినట్లు అయిందని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పులివర్తి నానిపై వైసీపీ అల్లరి మూకలు చేసిన దాడి అమానుషం అని జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు చిన్నరెడ్డిబాబు ఒక ప్రకటనలో ఖండించారు.

➡️