క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి : మస్తాన్‌ బాషాఘనంగా సమ్మర్‌ క్రికెట్‌ ముగింపు వేడుకలు

క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి : మస్తాన్‌ బాషాఘనంగా సమ్మర్‌ క్రికెట్‌ ముగింపు వేడుకలు

క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి : మస్తాన్‌ బాషాఘనంగా సమ్మర్‌ క్రికెట్‌ ముగింపు వేడుకలుప్రజాశక్తి- తిరుపతి(మంగళం):విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని ఫ్రెండ్లీ ఫైటర్స్‌ క్రికెట్‌ అకాడమీ (కోచ్‌) నిర్వాహకులు మస్తాన్‌ బాషా సూచించారు. ఆదివారం ఫ్రెండ్లీ ఫైటర్స్‌ క్రికెట్‌ అకాడమీ సమ్మర్‌ క్రికెట్‌ టోర్నమెంటు ముగింపు కార్యక్రమాన్ని తిరుపతి నగర పరిధిలో నిర్వహించారు. గత నెల మే 5 నుండి జూన్‌ 9వ తేదీ వరకు దాదాపు 36రోజులు సమ్మర్‌ క్రికెట్‌ క్యాంప్‌ నిర్వహించామని అన్నారు. ఈక్యాంపులో 80మంది క్రీడాకారులు ప్రతిరోజు పాల్గొన్నారని తెలిపారు. పెండ్లి ఫైటర్స్‌ క్రికెట్‌ అకాడమీ క్రికెట్‌ హెడ్‌ కోచ్‌ మస్తాన్‌ బాషా మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు అందరికీ ప్రతిరోజు వ్యాయామంతో పాటు ఆటలో ఉన్న మెలకువలను ఎంతో అనుభవంతో నేర్పించామన్నారు. 36 రోజుల వేసవి శిక్షణలో క్రీడాకారులకు 24 మ్యాచులను నిర్వహించామన్నారు. ఈ సమ్మర్‌ క్రికెట్‌ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి మెడల్స్‌, మొమెంటోలను అందజేశారు. ఈ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథులుగా సిడిసిఎ సెక్రటరీ గిరిధర్‌, టీటీడీ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ ఎ.ముని వెంకటరెడ్డి, సంస్కత విద్యాపీఠం ప్రొఫెసర్‌ వెంకట శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️