మూన్నాళ్ళకే ఇలా..

Dec 18,2024 13:59 #tirupathi

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : పట్టణంలోని నాగాలమ్మ ఆలయం వద్ద శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ఆర్అండ్బీ రోడ్డులో కురిసిన భారీ వర్షాలకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతలకు ఆర్అండ్బీ అధికారులు కంకర, క్రషర్ డస్ట్ వేసి మరమ్మత్తులు చేశారు. ఇది తమ ఘనతగా కూటమి నేతలు చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. గుంతలు పూడ్చి సరిగ్గా పది రోజులు కూడా కాకముందే మళ్లీ అదే ప్రాంతంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక మరమ్మత్తులతో సరిపెట్టకుండా శాశ్వత మరమ్మత్తులు చేపడితే ఫలితం ఉంటుందన్నది ప్రజల మాట. నాగాలమ్మ ఆలయం వద్దే కాకుండా బంగారమ్మ ఆలయం, తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కూడా ఇదే తరహాలో గుంతలు పడగా అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టేశారు. అక్కడ కూడా మూన్నాళ్ళ ముచ్చటగా యధావిధిగా గుంతలు ఏర్పడ్డాయి.

➡️