బిసీఎం పాఠశాల విద్యార్థులను అభినందించిన జెసి

బిసీఎం పాఠశాల విద్యార్థులను అభినందించిన జెసి

బిసీఎం పాఠశాల విద్యార్థులను అభినందించిన జెసిప్రజాశక్తి-తిరుపతి(మంగళం): విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని, రాణించాలని తెలుపుతూ బిసిఎం పాఠశాల క్రీడా ఆణిముత్యాలను జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ అభినందించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లో మంగళం స్థానిక బాలచంద్ర మెమోరియల్‌ హైస్కూల్‌ క్రీడాకారులు మర్యాద పూర్వకంగా తిరుపతి జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ను కలిశారు. జంప్‌ రోప్‌ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఇలాగే క్రీడల్లో ముందుకు సాగాలని మరెన్నో విజయాలను సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి గౌరవాన్ని ప్రతిష్టతను పెంచేలా ప్రతిభ కనబరచాలని కోరారు. అంతేకాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తూ మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిల వరకు ప్రోత్సహించిన బాలచంద్ర మెమోరియల్‌ హైస్కూల్‌ (బిసీఎం) పాఠశాల కరస్పాండెంట్‌ ప్రియాను, వ్యాయామ ఉపాధ్యాయు రాలు ప్రమీనను జెసి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌, ఎన్డీసి దేవేంద్ర రెడ్డి, డిఆర్డిఎ పిడి శోభన్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️