జనసేన పార్టీలో చేరిన జీవకోన యువతసత్యవేడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నూక తోటి రాజేష్‌ ఎన్నికల ప్రచారం

జనసేన పార్టీలో చేరిన జీవకోన యువతసత్యవేడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నూక తోటి రాజేష్‌ ఎన్నికల ప్రచారం

జనసేన పార్టీలో చేరిన జీవకోన యువతసత్యవేడు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నూక తోటి రాజేష్‌ ఎన్నికల ప్రచారంప్రజాశక్తి- నారాయణవనం: స్థానిక మండల కేంద్రంలో ఉన్న పాలమంగళం ఉత్తరపు కండ్రిగలో సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్‌ వైసిపి నాయకులు ఆయనకి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మండల నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రజలకు తెలియజేస్తూ మళ్లీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు మనమంత సిద్దమే అని ప్రచారం చేశారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి సమావేశానికి హాజరయ్యారని సస్పెండ్‌ అయిన వలంటీర్లు రాజేష్‌, ఎంపీపీ దివాకర్‌ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. వీరికి రాజేష్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

➡️