నగర వనానికి ‘జంగిల్‌ రైడర్‌’

నగర వనానికి 'జంగిల్‌ రైడర్‌'

నగర వనానికి ‘జంగిల్‌ రైడర్‌’ప్రజాశక్తి- తిరుపతి (మంగళం):తిరుపతి నగరపరిధిలోని అటవీశాఖ ఆధీనంలో ఉన్న తిరుపతి నగరవనంను సందర్శించే వారి కోసం అటవీశాఖ అధికారులు జంగిల్‌ రైడర్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాల ద్వారా దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో ఉన్న తిరుపతి నగరవనం అందాలను ఈ జంగిల్‌ రైడర్‌ వాహనం నడుపుతూ తిలకించడానికి అధికారులు నాలుగు వాహనాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరవనం నూతన శోభను సంతరించుకుంటున్న తరుణంలో ఈ వాహనాలను తీసుకురావడం వల్ల సందర్శకుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని, దీంతో పాటుగా సందర్శకులకు ఈవాహనం నడుపుతూ నగరవనాన్ని చూడడం కొత్త అనుభూతిని కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో జంగిల్‌ రైడర్‌ వాహనం 2లక్షల 75వేల విలువ అని, ప్రస్తుతం సందర్శకుల కోసం ప్రయోగాత్మకంగా నాలుగు వాహనాలను తీసుకొచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు.

➡️