అమరనాథ్‌రెడ్డికే ఛాన్స్‌తొలి మంత్రివర్గంలో ఖరారైనట్లే ఎంఎల్‌సి కోటాలో కంచర్ల శ్రీకాంత్‌కూ..

అమరనాథ్‌రెడ్డికే ఛాన్స్‌తొలి మంత్రివర్గంలో ఖరారైనట్లే ఎంఎల్‌సి కోటాలో కంచర్ల శ్రీకాంత్‌కూ..

అమరనాథ్‌రెడ్డికే ఛాన్స్‌తొలి మంత్రివర్గంలో ఖరారైనట్లే ఎంఎల్‌సి కోటాలో కంచర్ల శ్రీకాంత్‌కూ..ప్రజాశక్తి – తిరుపతి బ్యూరోరాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అమరావతిలో బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు 25 మంది మంత్రులను ప్రకటించనున్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో 164 స్థానాలు రావడంతో సంఖ్య రీత్యా 26మందికి పైగా ఇవ్వరాదు. మేజిక్‌ ఫిగర్‌ మేరకు ముఖ్యమంత్రి సహా 26 మందికే మంత్రివర్గ విస్తరణలో చోటు లభించనుంది. టిడిపి తరపున చాలామంది సీనియర్లు గతంలో మంత్రులుగా ఉన్నవారూ ఉన్నారు. గతంలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల వారికే తొలివిడత మంత్రి పదవులు ఇవ్వాలని టిడిపి అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జనసేనకు 5, బిజెపికి రెండు, మిగిలినవి టిడిపి వారిని ప్రకటించనున్నారు. ఈనేపథ్యంలో పలమనేరు ఎంఎల్‌ఎ ఎన్‌.అమరనాథరెడ్డికి చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లోకేష్‌ జరిపినయువగళం పాదయాత్రలో రాయలసీమవ్యాప్తంగా వెనకంటే ఉండి విజయవంతం అయ్యేలా అమరనాథరెడ్డి కృషి చేశారు. పైగా సీనియర్‌గానూ ఉన్నారు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కుప్పం ఇన్‌ఛార్జిగా ఉన్న ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి ఎంఎల్‌సి గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్‌కూ ఎంఎల్‌సి కోటాలో మంత్రి పదవి వచ్చే అవకాశం లేకపోలేదు.

➡️