జీవో నెంబర్‌ 177ను రద్దు చేయాలియుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు

జీవో నెంబర్‌ 177ను రద్దు చేయాలియుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు

జీవో నెంబర్‌ 177ను రద్దు చేయాలియుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావుప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : యుటిఎఫ్‌ మధ్యంత కౌన్సిల్స్‌ సమావేశం గూడూరు పట్టణంలోని పెన్షనర్‌ భవనంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంటనే జీవో నెంబర్‌ 177 రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలల వ్యవస్థను కొనసాగించాలని పాఠశాలల విలీనం రద్దు చేయాలని కొత్త ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి నవకోటి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న ఆర్థిక బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు చదవ గలిగిన బోధనామాద్యం వారికి నచ్చిన విధంగా ఎంచుకునే సౌలభ్యం కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా ప్రధానకార్యదర్శి ముత్యాలరెడ్డి మాట్లాడుతూ దాదాపు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విద్యారంగం పైన ప్రత్యేకశ్రద్ధ కనబరచాలని కోరడం జరిగిందని, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఉపాధ్యాయుల పెండింగ్‌ మెడికల్‌ బిల్లులు, ఉపాధ్యాయ సంక్షేమం వైపు కూడా కాస్త దష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అనంతరం నూతన ప్రభుత్వానికి వారు శుభాకంక్షలు తెలిపారు. సమావేశంలో తిరుపతి జిల్లాల 36 మండల శాఖల కార్యకర్తలతో రాబోయే నూతన విద్యాసంవ్సరానికి కావలసిన సన్నద్ధత గురించి చర్చించడం జరిగింది. యూటీఎఫ్‌ నాయకులు సుధీర్‌ సింగ్‌, మోహన్‌ , తదితరులు పాల్గొన్నారు.

➡️