కన్నతల్లి తల్లడిల్లి..ఆర్‌ఎంపి ఇంట విషాదం

కన్నతల్లి తల్లడిల్లి..ఆర్‌ఎంపి ఇంట విషాదం

కన్నతల్లి తల్లడిల్లి..ఆర్‌ఎంపి ఇంట విషాదంపజాశక్తి – పుత్తూరు టౌన్‌ (తిరుపతి జిల్లా) వేసవి సెలవుల్లో సరదాగా చెరువులో ఈతకెళ్లిన ముగ్గురు విద్యార్థులు లోతట్టు ప్రాంతంలో ఇరుక్కుని మృతిచెందారు. వడమాలపేట మండలం శ్రీబొమ్మరాజపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి డాక్టర్‌ పి.బాబు, విజయ దంపతుల ముగ్గురు పిల్లలు ఉషిక (17), చరిత (14), రిషిక (10) ఊరును ఆనుకుని ఉన్న ఆలయానికి వెళ్లారు. చెరువులో కాళ్లు కడుక్కుంటూ ఒకరితరువాత ఒకరు జారిపడిపోయారు. లోతట్టు ప్రాంతంలో తల్లి చూస్తుండగానే మునిగిపోయారు. ఉషిక ఇంటర్‌ పూర్తయ్యింది. చరిత తొమ్మిదో తరగతి చదువుతోంది. రిషిక ఐదో తరగతి చదువుతోంది. గ్రామస్తులు తెలుసుకుని పిల్లలను చెరువులోనుంచి బయటకు తీశారు. స్థానికులు వడమాలపేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పిల్లలు ముగ్గుర్ని ఒకేసారి కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఈ ఘటనతో గ్రామంలోనూ, పిల్లలు చదివే పాఠశాలల్లోనూ విషాదం అలముకుంది.

➡️