కూటమి విజయానికి కృషి చేసిన జనసైనికులకు సముచిత ప్రాధాన్యతకు కృషి – దేవర మనోహర్.

కూటమి విజయానికి కృషి చేసిన జనసైనికులకు సముచిత ప్రాధాన్యతకు కృషి - దేవర మనోహర్.

కూటమి విజయానికి కృషి చేసిన జనసైనికులకు సముచిత ప్రాధాన్యతకు కృషి – దేవర మనోహర్.

ప్రజాశక్తి రామచంద్రాపురం( చంద్రగిరి)

రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి కృషిచేసిన జన సైనికులకు సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు జనసేన పార్టీ ఇంచార్జ్ దేవర మనోహర్ తెలిపారు. మంగళవారం చంద్రగిరి నియోజకవర్గ మండల అధ్యక్షులతో, జనసేన పార్టీ ఇన్చార్జి దేవర మనోహర సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవుల్లో తమ పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. ఎన్నికల అనంతరం స్థానిక ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తినాని గెలిచిన తరువాత మొదటిసారి చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర్ జనసేన స్థానిక మండల అధ్యక్షులతో వారి కార్యాలయంలో సమావేశం అయ్యారు. పార్టీ అధిష్టానాన్ని కలిసిన వెంటనే ఈ సమావేశం ఏర్పాటు చేయడంతో మరింత ఉత్కంఠ భరితంగా ఉండటం విశేషం. ఈ సమావేశంలో ఎన్నికల సమయంలో కష్టపడిన జనసైనికులను గుర్తించి వారిని అభినందించారు. మున్ముందు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. అలాగే జనసేన పార్టీని మరింత పటిష్టం చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని నెలకొల్పేలా చర్చించారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వంలో జనసేన మున్ముందు చేపట్టాల్సిన భాద్యతలు మరియు అధికారులతో వ్యవహరించాల్సిన తీరుపై ఒక అవగాహనకు వచ్చినట్లు మనోహర్ తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ అనూహ్య భూమిక పోషించి తిరిగి లేని విజయానికి దోహద పడిందని ఆయన ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన ఎలా ముందుకు వెళుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో తపస్సి మురళి రెడ్డ, గురునాథ్ తలారి, పగడాల యువరాజ్, సంజీవి హరి, యువ కిషోర్ రాయల్, వెంకట్రాయల్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️