ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : సిపిఎం జిల్లా మహాసభలో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సత్యవేడులో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి నాగరాజు తెలిపారు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా మహాసభలు ఆదివారం 10 గంటలకు సత్యవేడు సాయిబాబా గుడి సమీపంలో విఎంకే కళ్యాణ మండపం ప్రాంగణంలో జరుగుతుందన్నారు. మహాసభలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, హాజరవుతారు అన్నారు. ఈ మహాసభలో బహుముఖ ప్రజ్ఞాశాలి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరికి ఘనంగా నివాళి అర్పించినట్టు వెల్లడించారు. మహాసభల సందర్భంగా ప్రదర్శనలో విచిత్ర వేషాదారులు కోలాట కళాకారులు డప్పు కళాకారులు రెడ్ షర్ట్ వాలంటీర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నారని పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ప్రతినిధుల సభలో జిల్లాలు ప్రజలు ఎదుర్కొంటున్న పనులు సమస్యలపై తీర్మానం చేయనున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ మహాసభలో ఎండగట్టడమే కాకుండా పలు తీర్మానాలు చేసి ప్రజల వద్దకు వెళ్లి వారిని చేతనం చేయడమే కాకుండా సమస్యలపై ఉద్యమాలు చేయను అంటూ వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కందారపు మురళి, టి సుబ్రమణ్యం, ఎస్ జయచంద్ర, ఐదవ జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి, సిపిఎం నగర కార్యదర్శి పి వేణు, కెఆర్ఎస్ మన్యం పాల్గొన్నారు.