జిల్లాను అందరి సమన్వయంతో అభివద్ధి చేద్దాం: కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌

జిల్లాను అందరి సమన్వయంతో అభివద్ధి చేద్దాం: కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌: జిల్లాను పర్యాటక ఆతిథ్య రంగంలో అన్ని విధాల అందరి సమన్వయంతో కలిసి కట్టుగా అభివద్ధి చేస్తామని తిరుపతి కలెక్టర్‌ డా ఎస్‌ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో పర్యాటక, ఆతిథ్య రంగంలో చక్కగా కషి చేసిన వారిని గుర్తించి వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినాన ఈ నెల 27న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవార్డు ఆఫ్‌ ఎక్సలెన్స్‌ 2023-24 సంవ్సరానికి జిల్లాలో అందుకున్న పలువురికి జిల్లా యంత్రాంగం తరపున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుపతి జిల్లా పర్యాటక, ఆతిథ్య రంగం ప్రమోషన్‌లో ఉత్తమ జిల్లాగా రాష్ట్ర స్థాయిలో 2023-24 సంవత్సరానికి అవార్డ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కింద ఎంపికై జిల్లాకు అయిదు అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా తిరుపతి జిల్లాలో పర్యాటక రంగం, ఆతిథ్య రంగ అభివద్ధికి ఎంతో అవకాశాలు ఉన్నాయని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగంపై అవగాహన, ఆసక్తి, ఉత్సుకత యువతలో పెంచే విధంగా క్విజ్‌ పోటీలు, రీల్స్‌ తయారీకి కాంపిటిషన్స్‌ ఏర్పాటు చేసి వాటికి మంచి ప్రైజ్‌ మనీ అందిస్తున్నామని 1 లక్ష, 50 వేలు, 25 వేలు రూపాయలు బహుమతులు ఇవ్వనున్నామని తెలిపారు. పర్యాటక ఆతిథ్య రంగంలో ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అందు కోసం వివిధ స్టేక్‌ హోల్డర్‌లు అందరూ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరుతూ, జిల్లా యంత్రాంగం తరఫున అవార్డు గ్రహీతలందరికీ మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అలాగే ఆతిథ్య రంగంలో ఉత్తమ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గా తిరుపతి తాజ్‌ హోటల్‌ ఎంపికై అవార్డు అందుకున్న నేపథ్యంలో రితేష్‌ చౌదరి జనరల్‌ మేనేజర్‌ తాజ్‌ హోటల్‌ వారిని, ఉత్తమ టూరిస్ట్‌ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌ గా తిరుపతి రైల్వే స్టేషన్‌ ఎంపిక అయినందున సత్యనారాయణ స్టేషన్‌ మేనేజర్‌ తిరుపతి రైల్వే స్టేషన్‌ వారిని, ఉత్తమ సోషల్‌ మీడియా ఇన్ఫ్లూన్సెర్‌ గా ఎంపికయిన ఎస్‌ ఇందిర ప్రియదర్శిని లా స్టూడెంట్‌ ఫైనల్‌ ఇయర్‌ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి వారిని, ఏపీ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ కేటగిరీ కింద టూరిజం ప్రమోషన్‌కు కృషిచేసిన కష్ణమూర్తి ఎన్జీవో శ్రీ బాలాజీ వుడ్‌ కార్వింగ్‌ ఆర్టిజాన్స్‌ మ్యూచువలీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ మాధవమాల ఏర్పేడు మండలం వారిని జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్‌ జ్ఞాపికను అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. పర్యాటకశాఖ అధికారులను కలెక్టర్‌ సత్కరించారు. పలువురు కలెక్టర్‌ ని, జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ ను జ్ఞాపిక అందజేసి శాలువాతో జిల్లా పర్యాటక శాఖ వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌, జిల్లా పర్యాటకశాఖ అధికారి రూపేంద్ర నాథ్‌ రెడ్డి, పర్యాటక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️