స్విమ్స్‌లో ఎంబిబిఎస్‌ అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభం

స్విమ్స్‌లో ఎంబిబిఎస్‌ అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభంప్రజాశక్తి – తిరుపతి సిటి స్విమ్స్‌ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎంబిబిఎస్‌ కోర్సులో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఉప కులపతి డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌ తెలిపారు. నీట్‌లో ర్యాంకులను సాధించాన ఆరుగురు విద్యార్థినులు ప్రవేశం పొందారని తెలిపారు. ఆలిండియా కోటా ద్వారా శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలకు కేటాయించిన 26 సీట్లలో మొత్తం ఆరుగురు విద్యార్థినులు వివిధ కేటగిరుల కింద యం.బి.బి.ఎస్‌. కోర్సు నందు అడ్మిషన్‌ పొందారు. న్యూఢిల్లీకి చెందిన ఆధ్యాసింగల్‌, హర్యానా నుంచి ప్రియాంషు, న్యూఢిల్లీ నుంచి మార్షల్‌ మండ్రో, నాందేడ్‌ నుంచి మానస్‌ గానేవార్‌, కేరళ రాష్ట్రం నుంచి లివింగ్‌ జారు ఉన్నారు. తాము ఎలాంటి కోచింగ్‌కు వెళ్లలేదని, ఇంట్లోనే సాధన చేసి, ఎంబిబిఎస్‌లో ఆలిండియా కోటా సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉషా కళావత్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శశికళ, సూపరింటెండెంట్‌ ధనలక్ష్మి పాల్గొన్నారు.

➡️