క్రమశిక్షణ, నాణ్యమైన విద్యను అందించడంలోఎంబియూ అగ్రగామితెలంగాణా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కపట్టుదల, కార్యదీక్షతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: డాక్టర్‌ ఎం.మోహన్‌ బాబు

క్రమశిక్షణ, నాణ్యమైన విద్యను అందించడంలోఎంబియూ అగ్రగామితెలంగాణా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కపట్టుదల, కార్యదీక్షతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: డాక్టర్‌ ఎం.మోహన్‌ బాబు

క్రమశిక్షణ, నాణ్యమైన విద్యను అందించడంలోఎంబియూ అగ్రగామితెలంగాణా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కపట్టుదల, కార్యదీక్షతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: డాక్టర్‌ ఎం.మోహన్‌ బాబుప్రజాశక్తి- రామచంద్రపురం (చంద్రగిరి): విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యను అందించడంలో మోహన్‌ బాబు విశ్వవిద్యాలయం అగ్రగామిగా ఉండడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఏ రంగంపేట సాయినగర్‌లోని మోహన్‌ బాబు విశ్వవిద్యాలయంలో మొదట స్నాతకోత్సవ, శ్రీ విద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ 13వ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎం.మోహన్‌ బాబు, సినీ నటుడు మంచు విష్ణు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విక్రమార్క మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల కార్యదీక్షతతో ఉన్నత శిఖరాలకు ఎదిగాలని అన్నారు. స్థాయిని, హోదాను పక్కన పెట్టి పదిమందికి పయోగపడేలా జీవితాన్ని మలుచుకోవాలని సూచించారు. ఎంబియూ ఛాన్స్లర్‌ డాక్టర్‌ మంచు మోహన్‌ బాబు సినీ, విద్యారంగంలో కూడా నైపుణ్యాన్ని సాధించి అగ్రస్థానాన్ని సాధించడం గొప్ప విషయం అన్నారు. సేవా దక్పథంతో పేద విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయించి విద్యనందించడం అభినందనీయమన్నారు. ఎంబియూ చాలా విశాలమైన మానస సరోవరం లాగా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నారు. నేటి ప్రపంచంలో ఎదుటి వ్యక్తులను ఓడించడం కన్నా వారి మనసును గెలిచి అద్భుత విజయాలను సాధించడానికి ప్రతి ఒక్కరు కషి చేయాలని కోరారు. మోహన్‌ బాబు మాట్లాడుతూ 32 సంవత్సరాల కషి ఫలితమే నేడు శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు యూనివర్సిటీ స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. తన గురువు గారైన దాసరి నారాయణరావు ఆశీస్సులతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు ఎంబియూ, శ్రీ విద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను పంపిణీ చేసి అభినందనలు తెలియజేశారు. భట్టి విక్రమార్కను దుశ్యాలువ పుష్ప హారాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛాన్సెలర్‌ మంచు విష్ణు, ఉపకులపతి నాగరాజ రామారావు, రిజిస్టర్‌ సారధి, డీన్లు, ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️