ప్రభుత్వ పథకాలపై వక్ఫ్ బోర్డు అధికారితో సమావేశంప్రజాశక్తి-శ్రీకాళహస్తి: రాష్ట్ర ప్రభుత్వం ముస్లింమైనారిటీలకు అందచేసే ప్రభుత్వ పథకాలపై వక్ఫ్ బోర్డు అధికారి గౌస్ మొహిద్దీన్ తో బుధవారం తిరుపతి కలెక్టరేట్ లో శ్రీకాళహస్తి ముస్లిం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహక కార్యదర్శి షాకీర్ అలీ పలు అంశాలపై చర్చించారు. ఇమాములు, మౌజన్ లకు వచ్చే జీతభత్యాలు గురించి ఆయన ఆరా తీశారు. మసీదుల ఆదాయాన్నిబట్టి ప్రభుత్వం ఈ జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మసీదుల మెయింటినెన్స్ కొరకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.5వేలు వంతున ప్రభుత్వం అందించే విధంగా చూడాలని ఆయన కోరారు. వక్ఫ్ బోర్డ్ అధికారి గౌస్ మొహిద్దీన్ ఈ సమస్య ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో. రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మహబూబ్ బాషా. శ్రీకాళహస్తి పట్టణ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ షఫీ, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.