970 కి. మీ లో పర్యాటక కోస్టల్ కారిడార్ ఏర్పాటుఁమంత్రి కందుల.దుర్గేష్ఁప్రజాశక్తి -దొరవారిసత్రం :ఆంధ్ర రాష్ట్రంలో పర్యాటక శాఖ పరంగా 970 కిలోమీటర్ల మేర పర్యాటక కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు సాంస్కృతిక,పర్యాటక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు.శనివారం సులూరుపేట లో ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగను ప్రారంభించిన మంత్రి మండల పరిధిలోని నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సందర్శించారు.చెట్లపై విడిది చేసి ఉన్న విదేశీ పక్షులను తిలకించి వాటి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆనవాయితీగా జరుగుతున్న పక్షుల పండుగను వైసీపీ ప్రభుత్వం పక్కన పడేశారని గుర్తు చేశారు.ఎన్ డి ఏ ప్రభుత్వంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుమకుత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని జాతీయస్థాయిలో గుర్తించి పర్యాటకులు వచ్చేలా కోస్టల్ కారిడార్ నిర్మాణాన్ని శ్రీకారం చుట్టూ ఉన్నట్లు పేర్కొన్నారు.
