శ్రీవారి మెట్టు వ్యాపారుల పొర్లుదండాలుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌శ్రీవారి మెట్టు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం టిటిడి పరిపాలన భవనం ముందు పొర్లు దండాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి ఆర్‌పిఐ రాష్ట్ర అధ్యక్షులు పి.అంజయ్య, కుమ్మరి సంఘం అధ్యక్షులు కేశవులు మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర మాట్లాడుతూ వారం రోజులుగా వ్యాపారులు నిరసన చేస్తున్నా టిటిడి యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
