కాపునాడు నియోజకవర్గ అధ్యక్షునికి ఎమ్మెల్యే ఆదిమూలం సత్కారం

Feb 16,2025 12:01 #Tirupati district

ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా): కాపునాడు సత్యవేడు నియోజకవర్గ అధ్యక్షునిగా ఎన్నికైన బాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘనంగా సత్కరించారు. ఆదివారం ఉదయం పిచ్చాటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను కాపునాడు సత్యవేడు నియోజకవర్గ నూతన అధ్యక్షులు బాల మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలను ఎమ్మెల్యే ఆదిమూలం గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాపునాడు అభ్యున్నతికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ డీ ఇలంగోవన్ రెడ్డి, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి చిన్నా, టిడిపి నాయకులు పద్దు రాజు, బుజ్జి నాయుడు, రవి రెడ్డి, డిల్లీ బాబు, రజని తదితరులు పాల్గొన్నారు.

➡️