బ్రహ్మోత్సవాలకు రండి..ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు రండి..ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు రండి..ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఆహ్వానంప్రజాశక్తి -తిరుపతి టౌన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశమయ్యారు. అయ్యారు. అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని చంద్రబాబు నాయుడును ఆయన కోరారు. మొదటి రోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తానని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ సమావేశంలో ఆరణి మదన్‌ పాల్గొన్నారు.

➡️