సిమెంట్ రోడ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Jan 8,2025 13:04 #Tirupati district

ప్రజాశక్తి-నారాయణవనం : సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలోని అరణ్యకండ్రిగ పంచాయతీ అరణ్యకండ్రిగలో బుధవారం ఉదయం 10:30 గంటలకు సత్తి వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతతో నిర్మించాలని తొలితిగతిన పూర్తి చేయాలని కోరారు.అనంతరం అరణ్యంకండ్రిగ గ్రామంలోని వినాయకుని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ మాజీ నెట్ కేఫ్ చైర్మన్ ఆర్డీఏకాంబరం మాజీ ఎంపీపీ గోవిందస్వామి మాజీ సర్పంచులు కేఎస్ రవి, ఎన్ కందస్వామి నాయుడు, ఆరుముగం ఉపసర్పంచ్ మురళి, డిప్యూటీ డిఇఓ ప్రభాకర్ రాజు, ఎంపీడీవో గుణశేఖర్, పంచాయతీరాజ్ డి ఈ వెంకటరమణ, ఏఈ నరేష్ నాయకులు జయచంద్ర నాయుడు, చంద్రప్ప నాయుడు, శ్రీనివాస యాదవ్అరణ్య కండ్రిగ హెడ్మాస్టర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️