శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పులివర్తి

Jun 8,2024 14:58 #Tirupati district

ప్రజాశక్తి-రామచంద్రపురం (చంద్రగిరి) : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిలు శనివారం చంద్రగిరిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపర్డెంట్ వెంకట్ స్వామి, ఆర్జిత సేవా ఇన్స్పెక్టర్ ధణశేఖర్ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పులివర్తి నాని దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వెనుక బడిన రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామి వారిని కోరినట్లు పులివర్తి నాని తెలిపారు.

➡️