ప్రజాశక్తి-బియన్ కండ్రిగ: తిరుపతి జిల్లా బియన్ కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాలను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సందర్శించారు. తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, ప్రిన్సిపాల్ తోను, ఎస్ ఐతోనూ, విద్యార్థులతోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేస్తానని తెలిపారు. విద్యా సంవత్సరం ఏప్రిల్ తో ముగియనునుడంతో ఉన్న నాలుగు నెలలు ఎలాంటి సమస్యలు విద్యార్థులకు కలవకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందని ఫోన్ ద్వారా సంభాషించిన ఎమ్మెల్యే ఆదిమూలం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తో మాట్లాడారు. బ్రేక్ ఫాస్ట్ సమయంలో విద్యార్థులతో భోజన సదుపాయాలపై ఆరా ఎమ్మెల్యే తీశారు. పిల్లలకు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యతతో కూడిన భోజనం విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. విద్యార్థులు గాని, వారి తల్లిదండ్రులు ఏవైనా పిర్యాదులు చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఎస్సై వారంలో ఒక్కసారైనా పాఠశాలను సందర్శించాలని ఆదేశించారు.