మోహన్ బాబు బౌన్సర్లు ఓవరాక్షన్

మోహన్ బాబు బౌన్సర్లు ఓవరాక్షన్ విద్యానికేతన్ విద్యాసంస్థల వద్ద ఉద్రిక్తత నారావారిపల్లెలో మంత్రి లోకేష్ ను కలిసిన మంచు మనోజ్ దంపతులు. ఎట్టికేలకు మనోజ్ అవ్వతతకు నివాళి

మోహన్ బాబు బౌన్సర్లు ఓవరాక్షన్

విద్యానికేతన్ విద్యాసంస్థల వద్ద ఉద్రిక్తత

నారావారిపల్లెలో మంత్రి లోకేష్ ను కలిసిన మంచు మనోజ్ దంపతులు.

ఎట్టికేలకు మనోజ్ అవ్వతతకు నివాళి

తిరుపతి సిటీ : తన అవ్వాతాతలకు నివాళులర్పించాలని మోహన్ బాబు కళాశాల వద్దకు మంచు మనోజ్ చేరుకోవడంతో, అక్కడ మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు భారీ ఎత్తున మోహరించారు. అవ్వ తాతలకు నివాళులు అర్పించి వెళ్ళుతానని పోలీసులు చెప్పడంతో, ఎట్టికెలకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంతంలోని అవ్వ తాతల సమాధుల వద్దకు వెళ్లేందుకు మనోజ్ చేరుకోవడంతో అక్కడకు మోహన్ బాబు కు చెందిన ప్రైవేట్ సిబ్బంది భారీగా చేరుకున్నారు . మనోజు తన భార్యను గేట్ లోపలికి అనుమతించిన వెంటనే. మోహన్ బాబు బౌన్సర్లు వారులో వారే చిన్నప్పటి గొడవ సృష్టించుకుని అయ్యయ్యో కొట్టేసారు అంటూ పెద్ద రాధాంతం చేశారు. పోలీసులు మంచు మనోజ్ ను మోహన్ బాబు విద్యాసంస్థల్లోకి వెళ్ళకూడదని, వెళ్ళితే శాంతి భద్రతలకు వివాహం కలుగుతుందని నోటీసులు అందజేశారు. మంచు మనోజ్ దంపతులు పోలీసుల నుండి నోటీసులు తీసుకొని నారావారిపల్లెలో సీఎం స్వగృహానికి చేరుకుని మంత్రి నారా లోకేష్ ను కలిశారు. నారావారిపల్లె నుండి నేరుగా మోహన్ బాబు విద్యాసంస్థల వద్దకు వెళ్లి అవ్వ తాతలకు నివాళులర్పించేందుకు వెళుతుండగా….. మోహన్ బాబు కళాశాల బౌన్సర్లు మంచు మనోజ్ దంపతులను కళాశాల లోపలికి వెళ్ళనీయకుండా గేట్లు వేసి అడ్డుకున్నారు. దీంతో కొంత ఉదృత వాతావరణం నెలకొంది మా అవ్వ తాతలకు నివాళులర్పించి వెళ్లిపోతానని పోలీసులను త్వరగా పోలీసులు అనుమతిచ్చారు. అయినా మోహన్ బాబు కళాశాల బౌన్సర్లు మంచు మనోజ్ లోపలికి వెళ్తున్న సందర్భంలో పోలీసులను సైతం లెక్కచేయకుండా బయటకు తోసేశారు. సీఐ గోవిందు కూడా కింద పడిపోవడం కూడా జరిగింది దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని, స్వల్ప లాఠీచార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆఖరికి మనోజ్ బోన్సర్లు సైతం గేట్లు లోపలికి అనుమతించలేదు. ఒకరిద్దరు మీడియా సిబ్బంది వెంట రాగా, మనోజ్ అతని భార్య మౌనిక, కళాశాల లోపలికి వెళ్లి మనోజ్ అవ్వ తాతలకు నివాళులర్పించారు. చంద్రగిరి సీఐ సుబ్రమిరెడ్డి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️