యువకుని హత్య

Jun 11,2024 22:10 #alcoholism, #Murder, #youth

ప్రజాశక్తి – తిరుపతి సిటీ :మద్యం మత్తులో స్నేహితులే తమ స్నేహితుడిని హత్య చేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తిరుపతి శివారు కరకంబాడి కాలనీకి చెందిన అమర్నాథ్‌ (30) భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆయన మద్యం తాగారు. మద్యం మత్తులో అమర్నాథ్‌ సెల్‌ఫోన్‌ను ఆయన స్నేహితులు తీసుకున్నారు. ఇంటికి వెళ్లి భార్యతో జరిగిన విషయం చెప్పడంతో ఆమె వచ్చి వారిని నిలదీశారు. మాటామాట పెరగడంతో గొంతు మీద కాలుతో నొక్కి అమర్నాథ్‌ను హతమార్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. అమర్నాథ్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️