జిల్లాలో ముసురు వర్షంకోట మండలంలో అత్యధికంగా 22.12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలో ముసురు వర్షంకోట మండలంలో అత్యధికంగా 22.12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ బంగాళాఖాత అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా తిరుపతి జిల్లాలో ముసురు వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా కోట మండలంలో 26.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా బిఎన్‌ కండ్రిగ 22.2, బాలాయపల్లి 9.8, తిరుపతి అర్బన్‌ 8.6, నాగలాపురం 8.6, వాకాడు 8.2, ఏర్పేడు 8.2, శ్రీకాళహస్తి 7.6, చిట్టమూరు,తొట్టంబేడు 7.4, రేణిగుంట 7.2, గూడూరు 5.6, చిల్లకూరు 5.2, ఓజిలి 5.2, వెంకటగిరి 5.2, దక్కిలి,పాకాల 4.2, దొరవారి సత్రం 3.6, వడమలపేట, తడ 3.4 పెళ్లకూరు, చిన్నగొట్టిగల్లు 3.2, నారాయణవనం 3.0, చంద్రగిరి, రామచంద్రపురం 2.8, నాయుడుపేట 2.6, ఎర్రవారిపాలెం 2.6, సూళ్లూరుపేట 2.4, తిరుపతి రూరల్‌, సత్యవేడు 2.4, పిచ్చాటూరు 2.4, కెవిబి.పురం, పుత్తూరు 1.6, వరదయ్యపాలెం 1.4 వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

➡️