20 నుంచి పౌరాణిక నాటికల పోటీలు

20 నుంచి పౌరాణిక నాటికల పోటీలు

20 నుంచి పౌరాణిక నాటికల పోటీలుప్రజాశక్తి- తిరుపతి(మంగళం): ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికగా అభినయ ఆర్ట్స్‌ 24వ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్‌ అవార్డ్స్‌ పౌరాణిక నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్‌ వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్‌.రెడ్డి తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 12 సాంఘిక నాటికలు, 9 పద్య నాటకాలను వివిధ ప్రాంతాలలో ఉన్న కళాకారులచే ప్రదర్శించబడతాయని అన్నారు. ఈ ప్రదర్శన కోసం రాష్ట్రవ్యాప్తంగా 57 సాంఘిక నాటికలకు, 32 పద్య నాటకములకు దరఖాస్తులు వచ్చాయన్నారు. పరిశీలన ఎంపికల తరువాత పరిమితంగా పద్య నాటకములు, సాంఘిక నాటికల కళాబందాలను ప్రదర్శనలకు ఎంపిక చేసామన్నారు. మన జాతీయ సంపద కళలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో అభినయ ఆర్ట్స్‌ గడిచిన 23 సంవత్సరాలుగా నిర్విరామంగా పద్య సాంఘిక నాటికల ప్రదర్శనలు చేస్తోందన్నారు. కళలు మానవ జీవితంలో ముడిపడి ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తోందని, అలాంటి కలలను నమ్ముకున్న వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అభినయ ఆర్ట్స్‌ అధ్యక్షులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి, విశ్వనాథరెడ్డి, శోభ, కోటేశ్వరరావు, భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️