ప్రజాశక్తి-నాయుడుపేట: నాయుడుపేటలో నిర్వహించిన ఎడ్ల పందాలలో అపసృతి నెలకొంది. ఒక మనిషి ప్రాణాల మీద తీసుకొచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా టిడిపి నాయకుల సహకారంతో ఆకుల కుబేరుమణి ఆధ్వర్యంలో నాయుడుపేటలో నూతనంగా నిర్వహించిన ఎడ్లబండి పందాల పోటీలలో అదుపుతప్పిన ఒక ఎడ్ల బండి పోటీలు చూడడానికి వచ్చిన మనుషులపైకి రావడంతో ఆ బండి కింద పడి ఒక వ్యక్తి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసుల సహాయంతో అతన్ని హాస్పిటల్ కు తరలించారు. నాయుడుపేటలో నూతనంగా నిర్వహించిన ఈ పోటీలలో ఏమాత్రం భద్రతా నియమాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఒక మనిషి ప్రాణాలు మీదకు తీసుకొచ్చింది.
