రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న నారా లోకేష్

Feb 16,2025 12:22 #Tirupati district

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తo ఆదివారం ఉదయం10.54 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట విద్యాశాఖ, ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఘన స్వాగతం లభించింది. తిరుపతి, చంద్రగిరి, నగరి, వెంటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, పూతలపట్టు, సర్వేపల్లి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్ నాయుడు, కురుగొండ్ల రామకృష్ణ, నెలవలి విజయశ్రీ, బొజ్జల సుదీర్ రెడ్డి, మురళీ మోహన్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు పార్ల మెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ, అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, నరసింహ యాదవ్, కాళహస్తి ఆర్ డి ఓ భానుప్రకాష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి కెవిఎన్ కుమార్, రేణిగుంట తాసిల్దార్ సురేష్ బాబు, ప్రజాప్రతినిధులు, మంత్రి వర్యులకు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వర్యులు రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరుకి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్ళారు.

➡️