తిరుపతి దాహార్తి తీరేనా..శ్రీ వర్షం పడకపోతే అంతే..!శ్రీ జూన్‌ వరకే తెలుగు గంగశ్రీ వేసవికి ప్రత్యేక నిధులు నిల్‌శ్రీ మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడిశ్రీ ఎస్‌ఎస్‌కెనాల్‌, గాలేరు నగరి ఊసేలేదుశ్రీ దశాబ్దాలుగా దృష్టిపెట్టని పాలకులు

తిరుపతి దాహార్తి తీరేనా..శ్రీ వర్షం పడకపోతే అంతే..!శ్రీ జూన్‌ వరకే తెలుగు గంగశ్రీ వేసవికి ప్రత్యేక నిధులు నిల్‌శ్రీ మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడిశ్రీ ఎస్‌ఎస్‌కెనాల్‌, గాలేరు నగరి ఊసేలేదుశ్రీ దశాబ్దాలుగా దృష్టిపెట్టని పాలకులు

తిరుపతి దాహార్తి తీరేనా..శ్రీ వర్షం పడకపోతే అంతే..!శ్రీ జూన్‌ వరకే తెలుగు గంగశ్రీ వేసవికి ప్రత్యేక నిధులు నిల్‌శ్రీ మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడిశ్రీ ఎస్‌ఎస్‌కెనాల్‌, గాలేరు నగరి ఊసేలేదుశ్రీ దశాబ్దాలుగా దృష్టిపెట్టని పాలకులుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుమలలో వరుణ యాగం చేయడం తప్ప, తిరుపతి కార్పొరేషన్‌లోనూ, జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ తాగునీటి సమస్య పరిష్కారానికి గత పదేళ్లుగా శాశ్వత ప్రాజెక్టుల ఊసే లేదు. ఈసారి వర్షాలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తే ప్రకటించడంతో తిరుపతి జల్లావాసులంతా ఊపిరి పీల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఒకవేళ రెండు మూడు నెలలు వర్షం పడని పక్షంలో రోజుమార్చి రోజు పంపిణీ చేస్తున్న తెలుగుగంగ జూన్‌కే ఖాళీ అవుతుంది.. మూడు నాలుగు రోజులకోసారి వదిలితే ఎలాగో డిసెంబర్‌ వరకూ కల్యాణిడ్యాంను సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రతి వేసవిలోనూ తాగునీటిపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు పంపి, వేసవికి ప్రత్యేక నిధులు తెప్పించుకుంటుంటారు. అయితే ఈ సారి సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని వేసవిలో తాగునీటి సమస్య ఉన్నచోట ప్రత్యేక నిధుల కేటాయింపే లేకుండా పోయింది. ఏదిఏమైనా జనసాంద్రత పెరిగి చెరువులు, కుంటలు మాయమవుతున్న తరుణంలో శాశ్వత ప్రాతిపదికన పూర్తవ్వాల్సిన సాగు, తాగునీటి కోసం అనుకున్న ఎస్‌ఎస్‌కెనాల్‌, గాలేరు-నగరి ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధులు సిబ్బంది జీతాలకే సరిపోని పరిస్థితి. ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్టులు పాలకుల మాటల్లో తప్ప చేతల్లో పూర్తి కాలేదు. తిరుపతి కార్పొరేషన్‌లో రెండు మూడు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, పుత్తూరు మున్సిపాలిటీల్లోనూ దాహార్తితో ప్రజలు విలవిలలాడుతున్నారు.తిరుపతి కార్పొరేషన్‌లో… ప్రైవేట్‌ ట్యాంకర్లు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి వేలల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తాగునీటి కోసం తిరుపతి ప్రజానీకం రోజుకు రూ.25 క్యానుకు ఖర్చు చేయాల్సిందే. దాదాపు వెయ్యి రూపాయల పైనే ప్రతి కుటుంబం తాగునీటికి వెచ్చిస్తోంది. ఏటా నీటి పన్నులు వసూలు చేస్తున్నారు తప్ప, సరిపడా నీరివ్వాలన్న ఆలోచనలో మాత్రం పాలకులు లేకపోవడంతో దశాబ్దాలుగా తాగునీటి సమస్య తిరుపతిని వెంటాడుతూనే ఉంది. యాత్రా స్థలమైన తిరుపతిలో తాగునీటి సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. బస్టాండ్‌ల్లో భక్తులకు బాటిల్‌ నీళ్లే దిక్కు. ఏటా పోటీపడి చలివేంద్రాలు నిర్వహించే రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల బిజీలో ఉండడంతో ‘కోడ్‌’ అడ్డు వస్తుందని వాటినీ ఏర్పాటు చేయలేదు. పేరు లేకుండా ఉచితంగా ఇవ్వాలన్న ఆలోచన బూర్జువా రాజకీయ పార్టీలకు లేకపోవడంతో ఎక్కడా తిరుపతి నగరంలో చలివేంద్రాలు కానరాని పరిస్థితి. అద్దెలకు ఉన్నవారు రోజుమార్చి రోజు గంటసేపు ఇచ్చే నీటితోనే సర్దుకుపోతూ, తగువులు పడుతూ ఉండాల్సిందే. ఇక అపార్టుమెంట్లు, వ్యాపార సంస్థలైన ట్యాంకర్లను తోలుకుని సర్దుకుపోతున్నారు. ఇక తిరుపతి కార్పొరేషన్‌లో దాదాపు 80 శాతం ఇళ్లల్లో క్యాన్‌ నీళ్లపైనే ఆధారపడి తాగునీటిని వాడుకుంటున్నారు. తిరుమల తిరుపతి నీటి వనరుల వివరాలు కైలాసగిరి : 53 ఎంఎల్‌డికళ్యాణి ఆనకట్ట : 10 నుండి 12 ఎంఎల్‌డిటీటీడీ ద్వారా కల్యాణి డ్యాం :15 నుంచి 18 ఎంఎల్‌డిబోర్‌వెల్‌ నీరు -:1.75 ఎం ఎల్‌ డిటిటిడికి నీటి సరఫరా : 5 ఎంఎల్‌డి481 బోర్‌వెల్స్‌లో 425 పనిచేస్తున్నాయి. వనరులు పుష్కలంగా ఉన్నాయి : టి.మోహన్‌, ఎస్‌ఇ తిరుపతికి నీటిని అందజేసే వనరులు ఈసారి పుష్కలంగానే ఉన్నాయి. ప్రస్తుతం చెన్నరుకి నీటిని అందిస్తున్నాం. తెలుగుగంగ నీరు తిరుపతికి జూన్‌ వరకు వస్తుంది. జూన్‌లో వర్షాలు పడితే గంగకు ఇబ్బందులు ఉండవు. ఒకవేళ వర్షాలు కురవకపోతే నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఉండే కండలేరు రిజర్వాయర్‌ నుంచి డెడ్‌స్టోరేజి నుంచి నీటిని పంపిణీ చేసుకోడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. కార్పొరేషన్‌ అధికారులో త్వరలో అమృత్‌ వాటర్‌ పథకం, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులను ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికైతే రెండురోజుల పాటు సరిపడా నీరు ఉంది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో…శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో రెండు రోజులకు ఒకసారి లేదంటే మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ జనాభా సుమారు 60 వేల మంది. కేపీ కెనాల్‌, ఎస్‌ఎస్‌ ట్యాంకుల ద్వారా పట్టణవాసులకు తాగునీటిని మున్సిపాలిటీ సరఫరా చేస్తుంది. ఎస్‌ఎస్‌ ట్యాంకు సామర్థ్యం 2200 మిలియన్‌ లీటర్లు కలిగి ఉంది. 1940 మిలియన్‌ లీటర్లు నీటిని ప్రస్తుతానికి సరఫరా చేస్తున్నారు. అందులో 42 తాగునీటి బోర్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారానూ నీళ్లను శ్రీకాళహస్తి పట్టణవాసులకు అందిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రజలు తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. సుమారు ఐదు నీటి ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీ తాగునీటిని సరఫరా చేస్తుంది.వెంకటగిరి మున్సిపాలిటీలో…వెంకటగిరిలో నీటి సరఫరా ఎపుడు చేస్తారో తెలియని పరిస్థితి… వెంకటగిరి మున్సిపాలిటీ జనాభా 55వేల మంది. వెంకటగిరికి ప్రధానంగా కండలేరు రిజర్వాయర్‌ ప్రధాన నీటి వనరు. ఎస్‌ ఎస్‌ ట్యాంకు ద్వారా రోజుకు 2000మిలియన్‌ లీటర్లు సరఫరా చేయాల్సి ఉండగా 1355 మిలియన్‌ లీటర్లు నీటిని సరఫరా చేస్తున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో 59 బోర్లు ఉండగా అందులో 22 బోర్లే పనిచేస్తున్నాయి. రెండు మూడు రోజులకు ఒకసారి వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో నీళ్లను సరఫరా చేస్తున్నారు. ఎస్‌ ఎస్‌ ట్యాంకు సామర్థ్యం 2200 మిలియన్‌ లీటర్లు కలిగి ఉంది. రోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని వెంకటగిరి మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు అంటున్నప్పటికీ రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే వస్తా ఉందని ప్రజలు అంటున్నారు.గూడూరు మున్సిపాలిటీలోగూడూరు మున్సిపాలిటీ జనాభా లక్ష 16 వేల మంది. గూడూరు పట్టణంలో సుమారు 65 వేల మంది నివాసం కలిగి ఉన్నారు. ప్రధాన నీటి వనరు కండలేరు రిజర్వాయర్‌. రెండు మూడు రోజులకు ఒకసారి తాగునీరు మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుంది. మొత్తం ఆరు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. రోజుకు 2500 మిలియన్‌ లీటర్లు సరఫరా చేయాల్సి ఉండగా, 1965 మిలియన్‌ లీటర్లు వీటిని సరఫరా చేస్తున్నారు. 18 బోర్లకు గాను 15 బోర్లు పనిచేస్తున్నాయని గూడూరు మున్సిపాలిటీ అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ కూడా ప్రజలు ట్యాంకర్లకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. వేసవికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్లే ఇబ్బందులని ప్రజలు వాపోతున్నారు. సూళ్లూరుపేటలోనూ తప్పని తిప్పలుఅన్నీ ఉన్నా అల్లుడి నోట్లు శని అన్న చందంగా వనరులన్నీ ఉన్నా తాగునీటి ఎద్దడి ఈ మున్సిపాలిటీలో నెలకొంది. రోజూ ప్రజలు చేతిలో బిందె పట్టుకుని ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తుంటారు. 25 వార్డుల్లో 58వేల మంది జనాభా ఉన్నారు. పిండిపాలెం వద్ద ఉన్న సమ్మర్‌ స్టోరేజి నుంచి నీటిని అందిస్తున్నారు. తల్లంపాడు చెరువు నుంచి డైరెక్టు పంపింగ్‌ ద్వారా కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తునానరు. ఏటా వేసవిలో సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు అడుగంటుతుంది. గత టిడిపి హయాంలో శాశ్వత పరిష్కారం లేదు. ఎఐఐబి ఆర్థిక సాయంతో రూ.162 కోట్లతో మంగళంపాడు చెరువులో సమ్మర్‌ స్టోరేజి నిర్మాణం చేపట్టారు. అక్కడనుంచి ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా నీరివ్వాలని ప్రణాళిక రూపొందించారు. రెండేళ్ల క్రితం మంగళంపాడు చెరువులో సమ్మర్‌ స్టోరేజి నిర్మాణ పనులు ప్రారంభించారు. కొంతదూరం పైప్‌లైన్ల పనులు జరిగాయి. ఇంతలో ఎన్నికలు రావడంతో వైసిపి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో రూ.162 కోట్ల ఎఐఐబి నీటి పథకం పనులు అసంతపూర్తిగానే ఉన్నాయి. అక్కడక్కడ నిర్మించిన ట్యాంకులు, సంపులు దిష్టిబొమ్మల్లా ఉన్నాయి. నీటి వనరులు పుష్కలంగా ఉన్నా నీటి ఎద్దడి నెలకొందంటే పాలకుల నిర్లక్ష్యమేనని జనం మండిపడుతున్నారు. సూళ్లూరుపేట ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ కెపాసిటీ 750మిలియన్‌ లీటర్లు సామర్ధ్యం. ప్రస్తుతం 355 మిలియన్‌ లీటర్లు సరఫరా చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదు. 42 బోర్లు ద్వారా ప్రజలు నీటిని తీసుకుంటున్నారు. వేసవి ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. పుత్తూరు మున్సిపాలిటీలోపుత్తూరు మున్సిపాలిటీలో తాగునీటి ఇబ్బందులు వర్ణనాతీతం. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్లపై నీటి కోసం ప్రజలు ఆధారపడి ఉన్నారు. 15 వార్డులకు గాను 12 వార్డుల్లో మాత్రమే రోజు మార్చి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన వార్డులో తాగునీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు .పుత్తూరు పట్టణ జనాభా సుమారు 40 వేల మంది కలిగి ఉన్నారు. ఇక్కడ రోజుకు 2,000 మిలియన్‌ లీటర్లు కావలసి ఉండగా కేవలం 1700 మిలియన్‌ లీటర్లు నీటిని మున్సిపాలిటీ అందిస్తుంది. 125 బోర్లు కలిగి ఉండగా అందులో 115 బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు అంటున్నారు.నాయుడుపేటలో బోర్లపైనే ఆధారంనాయుడుపేట మూడవ గ్రేడ్‌ పంచాయతీ. ఇక్కడ పట్టణ జనాభా సుమారు 30 వేల మంది. నాయుడుపేట మున్సిపాలిటీలో రోజు మార్చి రోజు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రోజుకి 1800 మిలియన్‌ లీటర్లు కావాల్సి ఉండగా కేవలం 1400 మిలియన్‌ లీటర్లు నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలకు సరఫరా చేస్తుంది. ఈ నీళ్లు ఏమాత్రం సరిపోవటం లేదు. వేసవికాలంలో బోర్లు కాలిపోవడంతో ఇక్కడ నీటి కోసం మహిళలు అల్లాడిపోతున్నారు. ప్రధాన నీటి వనరులు బోర్ల మీదే ఆధారపడి ఉండడం, అమత ట్యాంకులు నిర్మించకపోవడం తాగునీటికి సమస్యకు ఒక కారణంగా చెప్పవచ్చు. 52 బోర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.

➡️