మద్యం మత్తులో యువకుని హత్య

మద్యం మత్తులో యువకుని హత్యప్రజాశక్తి -తిరుపతి సిటీ మద్యం మత్తులో స్నేహితులే ఓ యువకుని హత్య చేసిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఈ ఘటన తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు… కరకంబాడి వద్ద నివాసం ఉంటున్న అమర్నాథ్‌ (30) మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ముగ్గురు స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. స్నేహితులు మతుడి ఫోన్‌ తీసుకోవడంతో భార్యతో వెళ్లి స్నేహితులను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తులైన స్నేహితులు అమర్నాథ్‌తో గొడవపడి గొంతు మీద కాలేసి హత్య చేసినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. యర్రావారిపాలెంకు చెందిన అమర్నాథ్‌కు ఇదివరకే వివాహమయ్యింది. ఇద్దరు పిల్లలు. మొదటి భార్యను వదిలేసి, వేరే మహిళతో ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు విచారణలో తేలాల్సి ఉంది.

➡️