ఎయిర్‌పోర్టులో ఆక్టోపస్ మాక్ ఆపరేషన్‌ప్రజాశక్తి – తిరుపతి సిటిఆక్టోపస్, పోలీస్ దళాలు శనివారం వేకువజామున రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం లో మాక్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ అర్ధరాత్రి ప్రారంభమై ఉదయం వరకు కొనసాగింది. అనుకోని విధంగా ఎదైనా తీవ్రమైన ఘటనలు లేదా ఉగ్రమూకలు దాడికి పాల్పడితే సిబ్బంది, ప్రయాణికులు, సందర్శకులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియ జేసేందుకు ఆక్టోపస్ దళాలు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, ఫైర్ సర్వీసు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు కలసి సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు.