రసవత్తరంగా మారుతున్న ఆఫీసర్ల క్లబ్‌ ఎన్నికలుఓటు హక్కులేని బయటి వ్యక్తుల రాజకీయంక్లబ్‌ ఐక్యత దెబ్బతీనే ప్రమాదంమేథావులు మేలుకోవాలంటున్న సభ్యులు

రసవత్తరంగా మారుతున్న ఆఫీసర్ల క్లబ్‌ ఎన్నికలుఓటు హక్కులేని బయటి వ్యక్తుల రాజకీయంక్లబ్‌ ఐక్యత దెబ్బతీనే ప్రమాదంమేథావులు మేలుకోవాలంటున్న సభ్యులు

రసవత్తరంగా మారుతున్న ఆఫీసర్ల క్లబ్‌ ఎన్నికలుఓటు హక్కులేని బయటి వ్యక్తుల రాజకీయంక్లబ్‌ ఐక్యత దెబ్బతీనే ప్రమాదంమేథావులు మేలుకోవాలంటున్న సభ్యులుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ తిరుపతి సాంస్కతిక యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఆఫీసర్స్‌ క్లబ్‌ అంటే ఎంతో గౌరవం కలిగిన క్లబ్‌. ఈ నెల 21వ తేదీ ఆఫీసర్స్‌ క్లబ్‌ ఎన్నికలు జరుగనున్నాయి.. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి ఎన్నికలు సజావుగా ప్రశాంతం వాతావరణంలో జరిగేవి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆఫీసర్‌ క్లబ్‌పై పెత్తనం చేసేందుకు కొందరు బయట వ్యక్తులు రాజకీయం చేయడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్లబ్‌లో ఉండే సభ్యులకు నగరంలో ఎంతో గౌరవం ఇస్తారు. ఆఫీసర్‌ క్లబ్లో ఎక్కువగా గెజిటెడ్‌ హోదా కలిగిన వారికి గౌరవ మర్యాదలు ఎక్కువ. క్లబ్లో మొత్తం 520 మంది సభ్యులు ఉన్నారు. ఆఫీసర్‌ క్లబ్‌ పరిధిలో ఓ కళ్యాణ మండపంతో పాటు 21 గదులు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇవ్వడం వలన సంవత్సరానికి ఎంత లేదన్నా రూ.50లక్షలు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వచ్చిన ఆదాయాన్ని ఆఫీసర్‌ క్లబ్‌ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నడూ లేనివిధంగా బయట వ్యక్తులు ఆఫీసర్‌ క్లబ్‌పై పెతనం చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ రెండు ప్యానల్‌ మాత్రమే పోటీలో ఉంటాయి. అయితే ఇక్కడ పోటీ చేసేవారు బయట వ్యక్తులు చొరబడి వారికి కావలసిన వారిని గెలిపించుకోవడానికి రాజకీయ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నడూ లేనివిధంగా బయట వ్యక్తులు ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఆఫీసర్‌ క్లబ్‌ అభ్యున్నతికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ క్లబ్‌లో బయట వ్యక్తుల జోక్యం పెరిగితే క్లబ్బు మనుగడ సాధించడం కూడా కష్టంగా మారే అవకాశాలున్నాయని పలువురు అంటున్నారు. తిరుపతి నగరంలో ఆఫీసర్‌ క్లబ్‌ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది, దీంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం క్లబ్‌ సాంస్కతిక కార్యక్రమాలకు నిలయంగా ఉంది. ఈ క్లబ్‌లో రక్తదాన శిబిరంతో పాటు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం, సాంస్కతిక కార్యక్రమాలు, ఆటపాటలు లాంటి అనేక కార్యక్రమాలు ఆఫీసర్‌ క్లబ్‌ సభ్యులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో బయట వ్యక్తులు జోక్యం చేసుకోవడం వల్ల క్లబ్‌లో జరిగే కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు గెజిటెడ్‌ హోదా కలిగిన సభ్యులు అంటున్నారు. రాజకీయ నేతలు ఈఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని క్లబ్‌ సభ్యులు వేడుకుంటున్నారు. ఆఫీసర్స్‌ క్లబ్‌ 1975 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన ఏర్పాటు చేశారు. అప్పటి టిటిడి ఈవో రాజగోపాల్‌ మొదటి అధ్యక్షులుగా పనిచేయడం విశేషం. ఎంతోమంది సభ్యులు దీన్ని గౌరవం కాపాడుతూ వస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించి గౌరవప్రదమైన సభ్యులను ఎన్నుకునే వారు. సభ్యులు కూడా గౌరవమర్యాదలు కలిగి ఉండేవారు. కొన్ని సందర్భాల్లో ఆఫీసర్‌ క్లబ్‌ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేది. గత నాలుగు సంవత్సరాల నుంచి రెండు ప్యానల్‌ మధ్య పోటీ ఎక్కువ ఉండడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆఫీసర్‌ క్లబ్‌ ఆదాయం బాగా ఉండడంతో బయట వ్యక్తులు దీనిపై కన్నేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల్లో మేధావులు బయట వ్యక్తులకు జోక్యం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఎన్నికల్లో పాల్గొని ప్రశాంతంగా నిర్వహించాలని సభ్యులు కోరుతున్నారు.

➡️